Saturday, November 15, 2025
HomeఆటIND vs AUS 2nd T20I: కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా హైవోల్టేజ్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?

IND vs AUS 2nd T20I: కాసేపట్లో భారత్-ఆస్ట్రేలియా హైవోల్టేజ్ మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?

IND vs AUS 2nd T20I live: తొలి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన తర్వాత ఆస్ట్రేలియాతో రెండో టీ20 మ్యాచ్ కు రెడీ అయింది టీమ్ ఇండియా. ఈ హై వోల్టేజ్ పోరు శుక్రవారం ఐకానిక్ మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (MCG) వేదికగా జరుగబోతుంది. తొలి మ్యాచ్ లో మాంచి టచ్ లోకి కనిపించాడు భారత్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. ఇతడితోపాటు వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ కూడా ఫామ్ లో ఉన్నట్లు కనిపించాడు.

- Advertisement -

ఈ మ్యాచ్ లో సూర్యా సేన 250 కంటే ఎక్కువ స్కోరు సాధించాలని హెడ్ కోచ్ గంభీర్ కోరుకుంటున్నాడు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ ఉన్న నేపథ్యంలో ఇలాంటి రిస్క్ చేయాలని టీమ్ ఇండియా భావిస్తోంది. అభిషేక్ శర్మ, తిలక్ వర్మ మరియు శివమ్ దూబే మరోసారి తమ మార్క్ ను చూపించేందుకు సిద్దమయ్యారు. బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ తో కూడిన బౌలింగ్ ద్వయం కూడా బలంగా ఉంది.

మరోవైపు ఆస్ట్రేలియా జట్టు బ్యాటింగ్ లో మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్, మార్కస్ స్టోయినిస్ మరియు టిమ్ డేవిడ్‌ల ఫైర్‌పవర్‌పై ఆధారపడి ఉంది. మిచెల్ స్టార్క్ టీ20ల నుండి రిటైర్ కావడం, పాట్ కమ్మిన్స్ పక్కన పెట్టడంతో.. బౌలింగ్ బాధ్యత జోష్ హాజిల్‌వుడ్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్ మరియు మాథ్యూ కుహ్నెమాన్‌లు తీసుకోనున్నారు. మెల్‌బోర్న్‌ మ్యాచ్ కు మరోసారి వరుణుడు అడ్డుపడే అవకాశం ఉంది. మ్యాచ్ 1:45 గంటలకు మెుదలుకానుంది. దీనిని స్టార్ స్పోర్ట్స్ తోపాటు జియో హాట్ స్టార్ లో వీక్షించవచ్చు.

Also Read: Women’s World Cup: – ఆట బాలేదు.. పక్కన పెట్టేస్తున్నా.. కానీ ఈ రియాక్షన్ అస్సలు ఊహించలేదేమో!

స్క్వాడ్‌లు:

ఇండియా: అభిషేక్ శర్మ, శుభ్‌మాన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ సామ్సన్ (వికెట్ కీపర్), శివమ్ దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి, వాషింగ్టన్ సుందర్, అర్ష్ దీప్ సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జితేష్ శర్మ

ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), మార్కస్ స్టోయినిస్, మిచెల్ ఓవెన్, జేవియర్ బార్ట్‌లెట్, సీన్ అబాట్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్, జోష్ ఫిలిప్, నాథన్ ఎల్లిస్, తన్వీర్ సంఘ, బెన్ ద్వార్షుయిస్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad