IND vs AUS 3rd ODI: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో భారత మహిళల జట్టు ఓటమిపాలైంది. 43 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన ఆసీస్ జట్టు ఈ సిరీస్‌ను కైవసం చేసుకుంది. 413 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన టీమిండియా 365 పరుగులకు ఆలౌట్ అయింది. స్మృతి మంధాన వన్డే సిరీస్‌లో ఫాస్టెస్ సెంచరీతో ఆకట్టుకుంది.
మూడు వన్డేల సిరీస్‌ను ఆస్ట్రేలియా జట్టు 2-1 తో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. బెత్ మూనీ భారీ శతకం బాదింది. 75 బంతుల్లో 23 ఫోర్లు, ఒక సిక్సు బాది 138 పరుగులతో జట్టుకు భారీ స్కోరు అందించింది. 47.5 ఓవర్లతో 412 పరుగుల చేసి ఆలౌటయింది.
Also Read: https://teluguprabha.net/sports-news/smriti-mandhana-fastest-century-in-ind-vs-aus-one-day-match/
ఇక 413 పరుగుల భారీ లక్ష్య ఛేదనకు దిగిన భారత జట్టుకి స్టార్ ఓపెనర్ స్మృతి మంధాన విధ్వంసకర బ్యాటింగ్‌ను స్కోరు బోర్డును పరుగులెత్తించింది. 63 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సులు బాది 125 పరుగులు చేసి రెండో ఫాస్టెస్ట్ సెంచరీతో రికార్డు సృష్టించింది. ఇక దీప్తి శర్మ 72 పరుగులు, హర్మన్ ప్రీత్ 52 పరుగులతో రాణించినా భారత మహిళల జట్టుకు ఓటమి తప్పలేదు.


