IND vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో టీమిండియా 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. దీంతో, ఇంకా సిరీస్ కైవసం చేసుకునేందుకు భారత్ అవకాశం చేజారిపోలేదు. అయితే, తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని టీమ్ఇండియా 18.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో వాషింగ్టన్ సుందర్ (49*; 23 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) ధనాధన్ ఇన్నింగ్స్‌తో అలరించాడు. తిలక్ వర్మ (29; 26 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్స్), అభిషేక్ శర్మ (25; 16 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), సూర్యకుమార్ యాదవ్ (24; 11 బంతుల్లో 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించారు.
Read Also: Women’s World Cup: అమ్మాయిలు అదుర్స్.. సౌతాఫ్రికా ఎదుట భారీ లక్ష్యం
దూకుడుగా బ్యాటింగ్
టీమ్ ఇండియా తన బ్యాటింగ్‌ను దూకుడుగా ప్రారంభించింది. ముఖ్యంగా అభిషేక్ శర్మ మొదటి రెండు ఓవర్లలో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లతో విరుచుకుపడ్డాడు. అయితే అభిషేక్.. నాథన్ ఎల్లిస్ బౌలింగ్‌లో (3.3) వికెట్ కీపర్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత కాసేపటికే శుభ్‌మన్ గిల్ (15) ఎల్లిస్ బౌలింగ్‌లోనే (5.3) ఎల్‌బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. రెండో మ్యాచ్‌లో విఫలమైన గిల్.. మూడో మ్యాచ్‌లోనూ పెద్దగా పరుగులు చేయలేదు. మంచి ఫామ్ లో కనిపించిన సూర్యకుమార్ యాదవ్ స్టాయినిస్ బౌలింగ్‌లో నాథన్ ఎల్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. తనకు లభించిన ఆరంభాన్ని తిలక్ వర్మ పెద్ద స్కోర్‌గా మలచలేకపోయాడు. జేవియర్ బార్ట్‌లెట్ బౌలింగ్‌లో జోష్ ఇంగ్లిస్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అక్షర్ పటేల్ (17) సైతం తక్కువ స్కోర్‌కే వెనుదిరిగాడు. త్రుటిలో హాఫ్‌సెంచరీని మిస్‌చేసుకున్న సుందర్ చివరి వరకు క్రీజులో పాతుకుపోయి, టీమ్‌ఇండియాకు విజయాన్ని అందించాడు. జితేశ్ శర్మ (22*) టీమ్ఇండియా విజయంలో కీలక పాత్రపోషించాడు. ఆసీస్ బౌలర్లలో నాథన్ ఎల్లిస్ 3, జేవియర్ బార్ట్‌లెట్, మార్కస్ స్టాయినిస్ తలో వికెట్ తీసుకున్నారు.
Read Also: Microsoft: నియామకాలు ఉన్నాయి..కానీ ఏఐ తర్వాతే!
ఆసీస్ బ్యాటింగ్..
ఆసీస్ బ్యాటింగ్ విషయానికొస్తే.. టాప్-3 బ్యాటర్లు విఫలమయ్యారు. అత్యంత తక్కువస్కోరుకే ఎలిమినేట్ అయ్యారు. ట్రావిస్ హెడ్ (6), మిచెల్ మార్ష్ (11), జోష్ ఇంగ్లిస్ (1) త్వరగా పెవిలియన్ చేరగా.. టిమ్ డేవిడ్ (74; 38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్స్‌లు), మార్కస్ స్టాయినిస్ (64; 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడారు. మాథ్యూ షార్ట్ (26*) పరుగులు చేశాడు. భారత్ బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ 3 వికెట్లు పడగొట్టగా.. వరుణ్ చక్రవర్తి 2, శివమ్ దూబె ఒక వికెట్ తీశారు.


