IND vs AUS 4th T20I Match Preview in Telugu: భారత్, ఆస్ట్రేలియా జట్లు కీలకమైన నాలుగో టీ20 మ్యాచ్ కు రెడీ అయ్యాయి. ఇరు జట్ల పోరుకు క్వీన్స్‌ల్యాండ్‌లోని కరారా ఓవల్ మైదానం వేదిక కానుంది. అయితే గత మ్యాచ్ లో గెలిచి సిరీస్ ను సమం చేసిన టీమ్ ఇండియా రెట్టించిన ఉత్సాహంతో బరిలోకి దిగుతోంది. జోష్ హేజిల్‌వుడ్, కొంతమంది పెద్ద ఆటగాళ్లు లేని లోటు ఆసీస్ జట్లు స్పష్టంగా కనిపిస్తోంది. ఈ మ్యాచులో గెలిచిన జట్టే సిరీస్ ను కైవసం చేసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
భారత్ గత మ్యాచ్ లో ఆడిన జట్టుతోనే బరిలోకి దిగే అవకాశం ఉంది. కుల్దీప్ కు మరోసారి నిరాశ ఎదురుకావచ్చు. తెలుగోడు నితీష్ కు కూడా చోటు దక్కడం కష్టమే. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ గిల్ ఫామ్ జట్టును కలవరపరుస్తోంది. వీరిద్దరూ భారీస్కోర్లు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ మ్యాచ్ ద్వారానైనా వారు గాడిలో పడాలని జట్టు భావిస్తోంది. అభిషేక్ శర్మ భీకర ఫామ్ లో ఉండటం భారత్ కలిసొచ్చే అంశం. తిలక్, జితేష్, అక్షర్ టచ్ లోనే ఉన్నారు. శివమ్ ధూబే బ్యాటింగ్ లో రాణించాల్సి ఉంది. సుందర్, బుమ్రా, అర్ష్‌దీప్ మరియు వరుణ్ చక్రవర్తితో కూడిన బౌలింగ్ విభాగం బాగానే ఉంది.
ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 1:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తోపాటు జియో హాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హెడ్ టు హెడ్ రికార్డ్సులో ఇండియా 21 గెలిస్తే, ఆస్ట్రేలియా 12 గెలిచింది. టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడానికి తిలక్ 9 పరుగుల దూరంలోనూ, అభిషేక్ 39 పరుగుల దూరంలోనూ ఉన్నారు. బుమ్రా 100 టీ20 వికెట్లు పూర్తి చేయడానికి, సుందర్ 50 టీ20 వికెట్లు పూర్తి చేయడానికి కేవలం రెండు వికెట్లు దూరంలో మాత్రమే ఉన్నారు.
ఫ్లేయింగ్ XI అంచనా
భారత్: శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), జితేష్ శర్మ (వికెట్ కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, జేవియర్ బార్ట్‌లెట్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్
Also Read: Sri Charani -వరల్డ్ కప్ విజయంలో కడప అమ్మాయి.. అసలు ఎవరీ శ్రీచరణి?
స్క్వాడ్స్
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, జేవియర్ బార్ట్‌లెట్, బెన్ ద్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ ఫిలిప్పే, తన్వీర్ సాంగ్‌మాన్.
భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా, సంజు శాంసన్, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా


