IND vs AUS 2nd T20I Highlights: మెల్‌బోర్న్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో భారత్ పై ఆస్ట్రేలియా 4 వికెట్లు తేడాతో గెలుపొందింది. ఐదు మ్యాచుల టీ20 సిరీస్ లో కంగూరు జట్టు 1-0తో లీడ్ లో నిలిచింది. హేజల్ వుడ్ కు ఫ్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
దెబ్బ తీసిన హేజల్ వుడ్..
తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్ బౌలర్ల ధాటికి టీమ్ ఇండియా బ్యాటర్ల చేతులెత్తేశారు. ముఖ్యంగా స్టార్ పేసర్ హేజల్ వుడ్ భారత టాపార్డర్ ను కుప్పకూల్చాడు. అతడు గిల్ 5, సూర్య 1, తిలక్ (0)ను ఔట్ చేసి ఇండియాను ఒత్తిడిలోకి నెట్టాడు.
అభిషేక్ శర్మ ఒంటరి పోరాటం..
మరోవైపు అభిషేక్ శర్మ అద్భుతమైన బ్యాటింగ్ తో అలరించాడు. ఒక ఎండలో వికెట్లు పడుతున్నతనదైన శైలిలో ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. హర్షిత్ రాణా(35)తో కలిసి మంచి పార్టనర్ షిప్ నెలకొల్పాడు. 37 బంతుల్లో 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 68 పరుగులు చేసి ఔటయ్యాడు. అభిషేక్ ఔటైనా తర్వాత టీమ్ ఇండియా వరుసగా వికెట్లు కోల్పోయింది. దీంతో సూర్య సేనా 18.4 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో హేజల్ వుడ్ మూడు వికెట్లు తీయగా..బార్టలెట్, ఎలిస్ చెరో రెండు వికెట్లు తీశారు.
మార్ష్ మార్క్ ఇన్నింగ్స్..
అనంతరం టార్గెట్ కు దిగిన ఆసీస్ కు ఓపెనర్లు మిచెల్ మార్ష్, ట్రావిస్ హెడ్ మంచి ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 51 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. కెప్టెన్ మిచెల్ మార్ష్(46), హెడ్ (28), ఇంగ్లీష్(20) మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఆస్ట్రేలియా 13.2 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. భారత బౌలర్లలో బుమ్రా, వరుణ్, కుల్దీప్ రెండేసి వికెట్లు తీశారు.
Also Read: India vs Australia Live – అభిషేక్ హాఫ్ సెంచరీ.. ఆస్ట్రేలియా టార్గెట్ ఎంతంటే?
స్క్వాడ్‌లు:
ఆస్ట్రేలియా – ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్ (జోష్ ఫిలిప్ స్థానంలో), జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, మరియు జోష్ హాజిల్‌వుడ్.
ఇండియా- శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, సంజు సామ్సన్ (వికెట్ కీపర్), శివం దుబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి మరియు జస్ప్రీత్ బుమ్రా.
Also read: Jemimah Rodrigues -జెమిమా రోడ్రిగ్స్ గురించి ఈ విషయాలు తెలుసా?


