IND vs AUS: ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో టీ20లో 48 పరుగుల తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలో వెళ్లింది. ఆస్ట్రేలియా, టీమ్ఇండియా మధ్య నాలుగో టీ20 క్వీన్స్‌ల్యాండ్ వేదికగా జరిగింది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 48 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమ్‌ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టపోయి 167 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ జట్టు 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌటైంది. ఆసీస్ బ్యాటర్లలో మిచెల్ మార్ష్ (30; 24 బంతుల్లో 4 ఫోర్లు) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్ చేశాడు. మ్యాథ్యూ షార్ట్ (25; 19 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించాడు. బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు మిచెల్, మాథ్యూ రూపంలో మంచి ఆరంభం దొరికింది. అయితే భారత స్పిన్నర్ అక్షర్ పటేల్ బంతితో మ్యాజిక్ చేశాడు. దీంతో మిడిలార్డర్ విఫలమైంది. అక్షర్ పటేల్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 20 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు కీలక వికెట్లను పడగొట్టాడు. అక్షర్ దూకుడుగా ఆడుతున్న మాథ్యూ షార్ట్‌ను ఔట్ చేసి భారత్‌కు తొలి వికెట్‌ను అందించాడు. ఓపెనర్సు ఘనమైన ఆరంభాన్ని ఇచ్చినప్పటికి మిడిలార్డర్ విఫలం కావడంతో ఆసీస్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
Read Also: Dinesh Karthik: పాక్ తో పోరుకు జట్టు సిద్ధం..కెప్టెన్ గా ఎవరంటే
చెలరేగిన బౌలర్లు…
టీమ్‌ఇండియా బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో 2, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, బుమ్రా చెరో వికెట్ తీసుకున్నారు.అంతకు ముందు టీమ్‌ఇండియా బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్ (46; 39 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్) రాణించాడు. భారత్ ఓపెనర్లు అభిషేక్ శర్మ, శుభ్ మన్ గిల్ దూకుడుగా ఆడారు. అభిషేక్ 21 బంతుల్లో 28 పరుగులు చేసి.. జంపా బౌలింగ్ లో ఔటయ్యాడు. అనంతరం శివం దూబెతో కలిసి గిల్ స్కోర్ బోర్డును ముందుకు నడిపించాడు. 39 బంతుల్లో 46 పరుగులు చేసిన గిల్.. తృటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. నాథన్ ఎల్లిస్ బౌలింగ్ లో గిల్ పెవిలియన్ చేరాడు. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ కేవలం 5 పరుగులే చేసి.. ఔటయ్యాడు. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా తక్కువ పరుగులకే పెవిలియన్ చేరాడు. చివర్లో అక్షర్ పటేల్(21), వాషింగ్టన్ సుందర్(12) రాణించడంతో భారత్ మంచి స్కోర్ చేయగలిగింది. ఈ విజయంతో టీమ్‌ఇండియా ఈ సిరీస్‌లో 2-1 తేడాతో ఆధిక్యం సాధించింది. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దైన సంగతి తెలిసిందే. ఇక చివరి టీ 20 నవంబర్ 8న బ్రిస్బేన్ వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్ లో భారత్ గెలిస్తే.. టీ 20 సిరీస్ కైవసం చేసుకోవచ్చు. Read Also: Yuvraj Singh: బూట్లు ఇచ్చుకుని కొడతా జాగ్రత్త…యువరాజ్ ఫైర్


