Kanpur one day Match: కాన్పూర్ వేదికగా ఆస్ట్రేలియా-ఎతో జరిగిన తొలి అనాధికారిక వన్డేలో భారత ప్లేయర్లు చెలరేగిపోయారు. ఆస్ట్రేలియాపై ఏకంగా 171 పరుగుల తేడాతో భారత్-ఎ జట్టు ఘన విజయం సాధించింది. 414 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి ఆసీస్ జట్టు 33.1 ఓవర్లలో కేవలం 242 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్ నిశాంత్ సింధూ 4 వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా ఆటగాళ్లను నిలువరించాడు. అతడితో పాటు రవి బిష్ణోయ్ రెండు, సిమ్రాన్‌జీత్ సింగ్, యుద్ద్‌వీర్ సింగ్, అయూష్ బదోని తలా వికెట్ సాధించారు. ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లలో మెకెంజీ హార్వే (68) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. నెదర్లాండ్(50), లాచ్లాన్ షా(45) బాగానే రాణించారు. శ్రేయాస్ అయ్యర్, ఆర్య సెంచరీలు చేసి చెలరేగిపోయారు. ముందుగానే బ్యాటింగ్ ఎంచుకున్న భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 413 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఇండియా బ్యాటర్లలో శ్రేయస్ అయ్యర్( 83 బంతుల్లో 12 ఫోర్లు, 4 సిక్స్‌లతో 110 పరుగులు), ప్రియాన్ష్ ఆర్య( 11 ఫోర్లు, 5 సిక్స్‌లతో 101) సూపర్ సెంచరీలతో చెలరేగారు. వీరిద్దరితో పాటు ప్రభ్ సిమ్రాన్ సింగ్(53 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లతో 56), రియాన్ పరాగ్(42 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్స్‌లతో 67), బదోని(27 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 50) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. సీస్ బౌలర్లలో విల్ సదర్లాండ్ రెండు, సంఘా, ముర్ఫీ, స్కాట్, స్టార్కర్ తలా వికెట్ సాధించారు. ఇరు జట్ల మధ్య రెండో వన్డే ఆక్టోబర్ 3న కాన్పూర్ వేదికగానే జరగనుంది.
రెండో టెస్ట్లో బంగ్లాదేశ్‌పై ఘన విజయం..
ఇదిలా ఉంటే, కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. బంగ్లాదేశ్ పెట్టిన 95 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని రోహిత్ సేన సులువుగా ఛేదించగలిగింది. మూడు వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. భారత యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి అర్ధ శతకం (51)తో రాణించాడు. తొలి ఇన్నింగ్స్‌లో రాణించిన యశస్వి రెండో ఇన్నింగ్స్‌లోనూ అద్భుతంగా ఆడాడు. 45 బంతులు ఎదుర్కొన్న జైస్వాల్ 8 ఫోర్లు, ఒక సిక్సర్‌తో 51 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్(8), శుభ్‌మన్ గిల్ (6) త్వరగానే పెవిలియన్ చేరినా.. మిగతా పనిని విరాట్ కోహ్లీ (29 నాటౌట్) చివరి వరకు క్రీజులో ఉండి పూర్తి చేశాడు. 17.2 ఓవర్లలో భారత్ 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇక, బంగ్లాదేశ్కు చెందిన బౌలర్ల విషయానికి వస్తే.. మెహదీ వరుసగా హసన్ మిరాజ్ 2, ఇస్లాం ఒక వికెట్ తీశారు. బంగ్లాదేశ్తో టెస్ట్ మ్యాచ్ విజయంతో భారత జట్టు రెండు మ్యాచ్ ల సిరీస్‌ను 2-0తో క్లీన్‌స్వీప్ చేసింది. దీంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరి భారత్ తన స్థానాన్ని మరింత పదిలం చేసుకుంది.


