India Vs Australia Live Score, 3rd ODI: సిడ్నీ వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. గత కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటున్న హర్షిత్ రాణా బౌలింగ్ లో నాలుగు వికెట్లుతో చెలరేగండో ఆస్ట్రేలియా 46.4 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌటైంది.
తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియాకు ఓపెనర్లు మార్ష్, హెడ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. ఇరువురు తొలి వికెట్ కు 61 పరుగులు పార్టనర్ షిప్ నెలకొల్పారు. 29 పరుగులు చేసిన హెడ్ ను సిరాజ్ ఔట్ చేసి భారత్ కు తొలి వికెట్ అందించాడు. అయితే 41 పరుగులు చేసిన మార్ష్ ను అక్షర్ పెవిలియన్ కు పంపాడు. గత మ్యాచ్ లో అద్భుతంగా ఆడిన షార్ట్ ఈసారి 30 పరుగులు మాత్రమే చేసి సుందర్ కు చిక్కాడు.
మూడు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసిన ఆసీస్ ను రెన్షా ఆదుకున్నాడు. కారీ అండతో అతడు చెలరేగి ఆడాడు. ఈ క్రమంలో హాఫ్ సెంచరీ కూడా పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ ఔటైన తర్వాత కంగూరు జట్టు త్వరగా వికెట్లను కోల్పోయింది. చివర్లో కూపర్ కొన్ని రన్స్ చేయడంతో అతిథ్య జట్టు 236 పరుగులకు కుప్పకూలింది. టీమ్ ఇండియా బౌలర్లలో హర్షిత్ రాణా నాలుగు వికెట్లు తీయగా.. వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీశాడు.
Also Read: Ind vs Aus 03rd ODI – కుప్పకూలిన టాపార్డర్.. 25 ఓవర్లలో ఆసీస్ స్కోరు ఎంతంటే?
ప్లేయింగ్ XI:
ఇండియా: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్


