India Vs Australia Live Score, 3rd ODI: సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో వన్డే ప్రారంభమైంది. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఎంచుకుంది. మూడు వన్డేల సిరీస్ లో ఇప్పటికే ఆసీస్ 2-0తో లీడ్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ లోనైనా గెలిచి పరువు దక్కించుకోవాలని టీమ్ ఇండియా భావిస్తోంది. ఈ సారి తుది జట్టులో కొన్ని కీలక మార్పులు చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ స్థానంలో కుల్దీప్ యాదవ్ ను తీసుకొచ్చింది. మరోవైపు అర్షదీప్ ఫ్లేస్ లో ప్రసిద్ధ్ కృష్ణ జట్టులోకి వచ్చాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కంగూరు జట్టుకు ఓపెనర్లు మార్ష్, హెడ్ మంచి ఆరంభాన్ని ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్ కు 61 పరుగులు జోడించారు. 29 రన్స్ చేసిన హెడ్ ను సిరాజ్ ఔట్ చేసి భారత్ కు తొలి వికెట్ అందించాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన షార్ట్ తో కలిసి నిలకడగా ఆడాడు మార్ష్. అయితే 41 పరుగులు చేసిన మార్ష్ ను అక్షర్ ఔట్ చేశాడు. కాసేపటికే షార్ట్ కూడా పెవిలియన్ చేరాడు. ప్రస్తుతం ఆసీస్ 26 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 137 పరుగులు చేసింది. రెన్షా 26 పరుగులతో, కారీ మూడు పరుగులతో ఆడుతున్నారు. అక్షర్, సిరాజ్, సుందర్ ఒక్కో వికెట్ తీశారు.
Also Read: Virat Kohli- ఎస్కలేటర్ మీద నుంచే ఫ్యాన్స్‌కి ఆటోగ్రాఫ్.. కోహ్లీ వీడియో వైరల్
ప్లేయింగ్ XI:
ఇండియా: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ
ఆస్ట్రేలియా మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, అలెక్స్ కారీ (వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, నాథన్ ఎల్లిస్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హాజిల్‌వుడ్


