IND vs AUS Live Score, 3rd T20I:భారత్ తో జరుగుతున్న మూడో టీ20లో ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. టిమ్ డేవిడ్, మార్క్ స్టొయినిస్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో కంగూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది.
తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది టీమ్ ఇండియా. అనంతరం బ్యాటింగ్ కు దిగిన ఆసీస్ కు ఓపెనర్లు ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ మంచి ఆరంభాన్ని ఇవ్వలేకపోయారు. తొలి రెండు టీ20లకు దూరమైన అర్షదీప్ ఈ మ్యాచ్ లో ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే బౌలింగ్ చేశాడు. తొలి ఓవర్ లోనే హెడ్ ను, ఆ తర్వాత ఇంగ్లీష్ ను పెవిలియన్ కు చేర్చి టీమిండియా మంచి బ్రేక్ ఇచ్చాడు. మరో ఎండలో వరుణ్ చక్రవర్తి కూడా అద్భుతమైన బౌలింగ్ చేశాడు.
అయితే టిమ్ డేవిడ్, మార్క్ స్టొయినిస్ అదిరిపోయే పార్టనర్ షిప్ తో కంగూరు జట్టుకు మంచి స్కోరు అందించారు. టిమ్ డేవిడ్ కేవలం 38 బంతుల్లోనే 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 74 పరుగులు చేయగా..మరోవైపు స్టొయినిస్ 39 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో 64 రన్స్ చేశాడు. చివర్లో షార్ కూడా మెరుపులు మెరిపించాడు. టీమ్ ఇండియా బౌలర్లలో ఆర్షదీప్ మూడు వికెట్లు, వరుణ్ రెండు వికెట్లు తీశారు.
ఆస్ట్రేలియా: మిచెల్ మార్ష్ (కెప్టెన్), ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మిచెల్ ఓవెన్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్‌లెట్, నాథన్ ఎల్లిస్, మాట్ కుహ్నెమాన్, సీన్ అబాట్
ఇండియా: శుభ్‌మాన్ గిల్, అభిషేక్ శర్మ,సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, శివం దుబే, జితేష్ శర్మ (వికెట్ కీపర్), వాషింగ్టన్ సుందర్, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్‌ప్రీత్ బుమ్రా.


