Ind vs Aus 02nd ODI: పెర్త్ ఓటమికి బదులు తీర్చుకునేందుకు టీమ్ ఇండియా తీవ్రంగా శ్రమిస్తోంది. బ్యాటర్లు, బౌలర్ల నెట్స్ లో చెమటొడిస్తున్నారు. భారత్, ఆస్ట్రేలియా మధ్య కీలకమైన రెండో వన్డే అడిలైడ్ వేదికగా అక్టోబర్ 23, గురవారం జరగనుంది. ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలని గిల్ సేన భావిస్తోంది. ఇందులో భాగంగా.. జట్టులో పలు మార్పులు చేయనుంది. బ్యాటింగ్ లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు గానీ బౌలింగ్ లో మాత్రం ఉంటాయి.
కుల్దీప్ ఇన్.. సుందర్, రాణా ఔట్..
అడిలైడ్ మ్యాచ్ కు స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అయితే అతడిని ఎవరి స్థానంలో తీసుకుంటారనేది ఇప్పుడు సస్పెన్స్. అందుతున్న సమాచారం ప్రకారం, కుల్దీప్ ను సుందర్ స్థానంలో తీసుకొచ్చే అవకాశం ఉంది. మరోవైపు బౌలింగ్ లో విఫలమైన హర్షిత్ రాణా ఫ్లేస్ లో ప్రసిద్ధ్ కృష్ణ కు ఛాన్స్ లభించవచ్చు. 29 ఏళ్ల కృష్ణ ఇప్పటివరకు దేశం తరపున 17 మ్యాచ్ లు ఆడి 29 మందిని ఔట్ చేశాడు. ఈ ఏడాది జరిగిన ఐపీఎల్ లో టాప్ వికెట్ టేకర్ గా కూడా ఉన్నాడు.
రోకో ఈ సారైనా రాణిస్తారా..
చాలా నెలల తర్వాత జట్టులోకి రీఎంట్రీ ఇచ్చిన రోహిత్, కోహ్లీ ఆశించిన స్థాయిలో ఆడలేదు. వారు ఈ మ్యాచ్ లోనైనా గాడిలో పడతారని జట్టు మేనేజ్మెంట్ భావిస్తోంది. కెప్టెన్ గిల్, వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా బ్యాటింగ్ లో రాణించాల్సి ఉంది. కేఎల్ రాహుల్, అక్షర్ పటేల్ టచ్ లోకి రావడం భారత్ కు ఆనందం కలిగించే విషయం. బ్యాటర్లలో ఎవరైనా గాయపడితే తప్ప యశస్వికి మరియు జురేల్ కు అవకాశం రాదు. తొలి వన్డేలో టీమ్ ఇండియా ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయిన సంగతి తెలిసిందే.
Also Read: Women’s World Cup 2025 -ఇండోర్ లో ఇంగ్లండ్ చేతిలో ఓటమి.. భారత్ సెమీస్ చేరే దారేది?
భారత్ ఫ్లేయింగ్ XI: రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.


