Saturday, November 15, 2025
HomeఆటIND vs AUS : మెల్‌బోర్న్‌లో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌ రద్దు.. కారణం...

IND vs AUS : మెల్‌బోర్న్‌లో జరగాల్సిన భారత్, ఆస్ట్రేలియా వన్డే మ్యాచ్‌ రద్దు.. కారణం ఏమిటంటే?

IND vs AUS Woman Cricket Match: రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత వన్డే జట్టు వచ్చే నెలలో ఆస్ట్రేలియా పర్యటనకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇండియా, ఆస్ట్రేలియా మధ్య వచ్చే ఏడాది జరగనున్న మూడు సిరీస్ మ్యాచ్లకు సంబంధించిన ఓ వార్త నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. వచ్చే ఏడాది భారత మహిళా జట్టు సైతం ఆస్ట్రేలియాలో వన్డేలు, టీ20 మ్యాచ్‌లు, టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం ఆడనుందని తెలిసిందే. అయితే, తాజాగా మహిళా వన్డే సిరీస్‌కు సంబంధించి క్రికెట్ ఆస్ట్రేలియా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. మెల్‌బోర్న్‌లోని జంక్షన్ ఓవల్‌లో జరగాల్సిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లోని రెండవ మ్యాచ్‌ను హోబర్ట్‌కు మార్చింది. దీని వెనుక ఉన్న కారణాలను కూడా తెలిపింది.

- Advertisement -

ఫ్లడ్ లైట్స్ లేని కారణంగానే..

భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య జరగనున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో రెండవ మ్యాచ్ మెల్‌బోర్న్‌లోని జంక్షన్ ఓవల్ మైదానంలో నిర్వహించాల్సి ఉంది. అయితే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ మైదానంలో కొత్త ఫ్లడ్‌లైట్లు ఏర్పాటయ్యే అవకాశం లేదని క్రికెట్‌ ఆస్ట్రేలియా తెలిపింది. ఈ కారణంగానే క్రికెట్ ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌ను హోబర్ట్‌కు మార్చినట్లు ప్రకటించింది. క్రికెట్ ఆస్ట్రేలియా క్రికెట్ ఆపరేషన్స్ హెడ్ పీటర్ రోచ్ మాట్లాడుతూ.. వచ్చే ఏడాది జరగబోయే భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మహిళా మ్యాచ్‌ను జంక్షన్ ఓవల్ నుంచి తరలించాల్సి రావడం, ఈ సీజన్‌లో మెల్‌బోర్న్‌లో మహిళల అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగకపోవడం మాకు నిరాశ కలిగించింది. ఈ మ్యాచ్‌కు చాలా వారాల ముందే జంక్షన్ ఓవల్‌లో లైట్లు ఏర్పాటు చేస్తారని మేమందరం ఊహించాం. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల అది జరిగే అవకాశం లేకపోవడంతో నిరాశ చెందుతున్నాం.’ అని తెలిపాడు.

మహిళల ప్రపంచ కప్ పైనే అందరి దృష్టి..

2026లో భారత మహిళా జట్టు ఆస్ట్రేలియా పర్యటనపైనే అందరి దృష్టి పడింది. ఈ సిరీస్‌ కోసం సగటు క్రికెట్‌ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. వచ్చే ఏడాది భారత్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా మహిళా జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లు జరగనున్నాయి. ఆ తర్వాత మూడు మ్యాచ్‌ల ఓడీఐ సిరీస్, తరువాత ఒక టెస్ట్ మ్యాచ్‌లను సైతం నిర్వహించనున్నారు. ఈ పర్యటనలో మొదటి టీ20 మ్యాచ్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 15న, చివరి టెస్ట్ మ్యాచ్ మార్చి 6న జరగనుంది. కానీ, దీనికి ముందు, భారత మహిళా జట్టు స్వదేశంలో జరిగే 2025 వన్డే ప్రపంచ కప్ టైటిల్‌ను కైవసం చేసుకునేందుకు సిద్ధమవుతోంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad