Monday, July 14, 2025
HomeఆటIND vs ENG: రెచ్చిపోతున్న ఇంగ్లాండ్.. స్మిత్, బ్రూక్ సూపర్ సెంచరీలు

IND vs ENG: రెచ్చిపోతున్న ఇంగ్లాండ్.. స్మిత్, బ్రూక్ సూపర్ సెంచరీలు

IND vs ENG 2nd Test: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య రెండో టెస్టు జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 587 పరుగుల భారీ స్కోరుకు ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ జట్టు పోరాటపటిమ చూపిస్తోంది. ఓవర్ నైట్ స్కోర్ 77/3 పరుగుల వద్ద మూడో రోజు ఆట ప్రారంభించిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు షాక్ ఇచ్చారు. త్వరత్వరగా మరో రెండు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ తీశారు. జో రూట్ 22 పరుగులు, కెప్టెన్ బెన్ స్టోక్స్‌ డకౌట్ అయ్యారు. దీంతో 84 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఆతిథ్య జట్టు కష్టాల్లో పడింది.

- Advertisement -

అయితే వికెట్ జేమీ స్మిత్ దూకుడైన ఆటతో రెచ్చిపోయాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్మురేపాడు. ప్రసిద్ధ్ కృష్ణ వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 4 ఫోర్లు, సిక్సర్ కొట్టాడు. మరో ఎండ్‌లో హ్యారీ బ్రూక్ కూడా స్మిత్‌కు మద్దతుగా నిలిచాడు. ఇద్దరు చక్కటి షాట్లు కొడుతూ స్కోర్ బోర్డును పరిగెత్తించారు. వారిద్దరి హిట్టింగ్ దెబ్బకు భారత బౌలర్లు తేలిపోయారు. లంచ్ బ్రేక్ సమయానికే స్మిత్ సెంచరీతో అదరగొట్టాడు.

లంచ్ టైంకి ఇంగ్లాండ్ 249/5 పరుగులు చేసింది. అనంతరం ఆట ప్రారంభం కాగా.. బ్రూక్ కూడా సూపర్ సెంచరీ చేశాడు. దీంతో ఇద్దరు ఆటగాళ్లు కలిసి మ్యాచ్‌పై పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. వీరిలో ఒకరిని త్వరగా ఔట్ చేస్తేనే టీమిండియాకు విజయ అవకాశాలు దక్కుతాయి. భారత బౌలర్లలో మహమ్మద్ సిరాజ్ 3, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీశారు. ప్రస్తుతం ఇంగ్లాండ్ స్కోర్ 289/5 పరుగులుగా ఉంది.

తొలి రోజు బ్యాటింగ్ చేసిన టీమిండియా దూకుడుగా ఆడింది. కెప్టెన్ శుభమన్ గిల్ సెంచరీతో దుమ్మురేపగా.. యశస్వి జైస్వాల్ 87 పరుగులతో రాణించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ స్కోర్ 310/5 పరుగుల వద్ద ఉంది. రెండో ఆట ప్రారంభించిన టీమిండియా వికెట్లను కాపాడుకుంటూ పరుగులు రాబట్టింది.

గిల్‌తో కలిసి రవీంద్ర జడేజా కూడా ధాటిగా ఆడాడు. ఈ క్రమంలో గిల్ డబుల్ సెంచరీని తన ఖాతాలో వేసుకున్నాడు. అనంతరం 269 పరుగుల వద్ద గిల్ పెవిలియన్ చేరగా.. జడేలా 89 పరుగులో వద్ద ఔటై తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నాడు. చివర్లో వాషింగ్టన్ సుందర్ 42 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ బౌలర్లలో షోయబ్ బషీర్ మూడు వికెట్లు తీయగా.. క్రిస్ వోక్స్, జోష్ టంగ్ చెరో వికెట్లు పడగొట్టారు. బ్రైడన్ కార్స్, బెన్ స్టోక్స్, జో రూట్‌లకు తలా ఓ వికెట్ దక్కింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News