Saturday, November 15, 2025
HomeఆటIND Vs ENG: లార్డ్స్ టెస్టు నుంచి నితీశ్ ఔట్..గంభీర్ శిష్యుడికి చోటు

IND Vs ENG: లార్డ్స్ టెస్టు నుంచి నితీశ్ ఔట్..గంభీర్ శిష్యుడికి చోటు

IND Vs ENG: టీమ్ ఇండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ నాయకత్వంలో తొలి టెస్ట్ ఓడిన తర్వాత రెండో టెస్టులో రాణించింది. ఇప్పుడు మూడో టెస్టులోనూ గెలిచి సిరీస్‌పై పట్టు సాధించాలని గిల్ సేన ప్రణాళికలు రచిస్తుంది. ఈ సిరీస్ లో భాగంగా మూడో టెస్టు జూలై 10న లార్డ్స్ లో ప్రారంభం కానుంది.

- Advertisement -

సిరీస్‌పై పట్టు సాధించాలంటే..!!

మూడో టెస్టులో భారత్ విజయం సాధిస్తే.. ఇంగ్లాండ్ పై ఒత్తిడి మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో టీమ్‌ఇండియా ఎలెవెన్‌లో కొన్ని మార్పులు తప్పవు అనిపిస్తుంది. తెలుగబ్బాయి గత రెండు మ్యాచ్‌ల్లో అంతగా రాణించకపోయిన కారణంగా అతడిని మూడో టెస్టులో పక్కన పెట్టే అవకాశం కనిపిస్తుంది. ఇదే విషయమై కొన్ని వార్తలు వస్తున్నాయి. అయితే అతడి స్థానంలో కోచ్ గౌతమ్ గంభీర్ తన శిష్యుడిని జట్టులోకి తీసుకునేందుకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మూడో మ్యాచ్‌లో ప్లేయింగ్ 11లో గౌతమ్ గంభీర్ కీలక మార్పులు..

లార్డ్స్ వేదికగా ఇంగ్లాండ్ Vs భారత్ మధ్య జరగనున్న మూడో టెస్టు ప్లేయింగ్ 11 గురించి మాట్లాడుకుంటే.. బ్యాటింగ్ లైనప్‌లో ప్రస్తుతం ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, రిషబ్ పంత్ వరకు బ్యాటింగ్ లైనప్ సూపర్ ఫామ్‌లో ఉంది.
అయితే కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం కరుణ్ నాయర్ విషయంలో కొంత ఆలోచించే అవకాశం ఉంది. మొదటి రెండు మ్యాచ్‌ల్లో అతడు విఫలమయ్యాడు. మూడో టెస్టులో అడే అవకాశంపై సందిగ్ధం మొదలైంది.

శార్దూల్ ఠాకూర్‌ ఇన్..
జట్టులో మార్పుల గురించి మాట్లాడుకుంటే.. మూడో టెస్టులో బ్యాటర్ నితీష్ కుమార్ రెడ్డిని పక్కన పెట్టే అవకాశం కచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆడిన రెండు మ్యాచ్‌ల్లో అతడి ప్రదర్శన అంత బాగా లేదు. రెండో మ్యాచ్‌లో అయితే రెండు ఇన్నింగ్స్‌లలో అతని బ్యాట్ నుంచి కేవలం 2 పరుగులు మాత్రమే రావడం గమనార్హం. బౌలింగ్ లోనూ అతడు ఒక్క వికెట్ కూడా రాబట్టలేదు. అతడి స్థానంలో శార్దూల్ ఠాకూర్ కు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉంది.

బుమ్రా రీఎంట్రీ..
నితీష్ కుమార్ రెడ్డినే కాకుండా ప్రసిద్ధ్ కృష్ణని కూడా మూడో టెస్టులో చూడకపోవచ్చు. ఎందుకంటే బుమ్రా రాకతో అతడిని జట్టులోని తొలగించే అవకాశం ఉంది. అందులోనూ గత మ్యాచ్‌లలో అతడి ఎకానమీ మరింత పెరిగింది. 

ఇంగ్లాండ్‌తో మూడో మ్యాచ్‌లో టీమ్ఇండియా ప్లేయింగ్ 11 (అంచనా):
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఆకాశ్ దీవ్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad