Saturday, November 15, 2025
HomeఆటIndia vs England: రిషబ్ పంత్‌కి తీవ్ర గాయం.. రెండో రోజు బరిలోకి దిగుతాడా?

India vs England: రిషబ్ పంత్‌కి తీవ్ర గాయం.. రెండో రోజు బరిలోకి దిగుతాడా?

IND Vs ENG 4th Test Live Updates: భారత్,ఇంగ్లాండ్ మధ్య నాలుగో టెస్టు మాంచెస్టర్ వేదికగా బుధవారం ప్రారంభమైంది. గాయాల కారణంగా ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లను కోల్పోయి..ఈ టెస్టులో బరిలోకి దిగిన టీమిండియాకు మరో షాక్ తగిలింది. మ్యాచ్ మధ్యలో గాయం కారణంగా రిషబ్ పంత్ రిటైర్ హార్ట్ గా వెనుదిరిగాడు. దీంతో భారత శిబిరంలో ఆందోళన మెుదలైంది. అతడు రెండో రోజు బరిలోకి దిగుతాడా లేదా మెుత్తం టెస్టు మ్యాచ్ కే దూరమవుతాడా? అనే సందేహం అందరిలోనూ ఉంది. పంత్ ఎలా గాయపడ్డాడో ఇప్పుడు చూద్దాం.

- Advertisement -

నాలుగో టెస్టు తొలి ఇన్నింగ్స్ 68వ ఓవర్లో రిషబ్ పంత్ గాయపడ్డాడు.క్రిస్ వోక్స్ వేసిన నాలుగో బంతిని రివర్స్ స్వీప్ ఆడబోయాడు. అది మిస్ అవ్వడంతో బాల్ అతడి షూ ను నేరుగా తాకింది. LBW కోసం అప్పీల్ చేసిన నాటౌట్ అని తేలింది. అయితే పంత్ మాత్రం తీవ్రమైన నొప్పితో బాధపడ్డాడు. పెయిన్ ఎక్కువగా ఉండటంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అనంతరం పంత్ ను చికిత్స కోసం పంపించారు.

తొలుత టాస్ గెలిచిన స్టోక్స్ సేన బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ దిగిన టీమిండియాకు ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. యశస్వి జైశ్వాల్(58) హాఫ్ సెంచరీ సాధించగా..కేఎల్ రాహుల్ 46 పరుగులు చేసి ఔటయ్యాడు. కెప్టెన్ గిల్ కేవలం 12 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు.

ALSO READ: https://teluguprabha.net/sports-news/indian-chess-star-divya-deshmukh-creates-history-at-fide-womens-chess-world-cup-2025/

ఆ తర్వాత పంత్ కు జతకలిసిన సాయిసుదర్శన్ ఆచితూచి ఆడుతూ స్కోరుబోర్డును పరుగులెత్తించారు. ఈ క్రమంలో పంత్ 37 పరుగుల వద్ధ ఉండగా గాయమైంది. దీంతో అతడు మైదానాన్ని వీడాల్సి వచ్చింది. అద్భుతంగా ఆడిన సాయిసుదర్శన్ 61 పరుగులు చేసి ఔటయ్యాడు. జడేజా, శార్ధూల్ ఠాకూర్ మరో వికెట్ పడకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో గిల్ సేన తొలి రోజు ఆటముగిసే సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 264 పరుగులు చేసింది. బెన్ స్టోక్స్ రెండు వికెట్లు తీశాడు.

భారత్ జట్టు: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, అన్షుల్ కాంబోజ్

ఇంగ్లాండ్ జట్టు: జాక్ క్రాలే, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రూక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జామీ స్మిత్ (వికెట్ కీపర్), లియామ్ డాసన్, క్రిస్ వోక్స్, బ్రైడాన్ కార్స్, జోఫ్రా ఆర్చర్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad