Ind Vs Eng 5th Test Live Score: టీమిండియా, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న ఐదో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్లు నువ్వా-నేనా అన్న రీతిలో పోటీపడుతున్నాయి. భారత పేసర్లు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ చెలరేగడంతో ఇంగ్లీష్ టీమ్ 247 పరుగులకే ఆలౌటైంది. దీంతో ఆ జట్టు కేవలం 23 పరుగుల లీడ్ మాత్రమే సాధించింది.
జైస్వాల్ హాఫ్ సెంచరీ
గిల్ సేన రెండో ఇన్నింగ్స్ ను కూడా ధాటిగానే ప్రారంభించింది. కేఎల్ రాహుల్, సాయి సుదర్శన త్వరగానే పెవిలియన్ చేరినా..యశస్వి జైస్వాల్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దీంతో టీమిండియా రెండో రోజు ఆటముగిసే సమయానికి 18 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి75 పరుగులు చేసింది. భారత జట్టు 52 రన్స్ లీడ్ సాధించింది.
అంతకముందు 204/6 తో తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ జట్టు మరో 20 పరుగులు మాత్రమే జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది.కరుణ్ నాయర్(57) హాఫ్ సెంచరీతో సత్తా చాటాడు. ఇంగ్లండ్ బౌలర్లలో అట్కిన్సన్ ఐదు వికెట్లతో చెలరేగాడు.
చెలరేగిన సిరాజ్, ప్రసిద్ధ్
శుక్రవారం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇంగ్లండ్ కు ఓపెనర్లు శుభారంభం ఇచ్చారు. జాక్ క్రాలీ, డకెట్ చెలరేగడంతో ఆ జట్టు లంచ్ విరామనికి వికెట్ మాత్రమే కోల్పోయి 109 పరుగులు చేసింది. డకెట్ 43 పరుగులు చేసి ఆకాశ్ దీప్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఒకానొక దశలో భారీ స్కోరు చేస్తుందని అనుకున్న సమయంలో సోక్ట్స్ సేన అనూహ్యంగా కుప్పకూలింది.
Also read: Yuzvendra Chahal – మోసగాడు అన్నారు…సూసైడ్ చేసుకోవాలనుకున్నాను..!
లంచ్ తర్వాత టీమిండియా బౌలర్లు విజృంభించారు. అయితే అర్థ సెంచరీ చేసిన జాక్ క్రాలీ(64)ను ప్రసిద్ధ కృష్ణ ఔట్ చేశాడు. ఓపెనర్లు ఔటయ్యాక ఓలీ పోప్, జో రూట్ నిలకడగా ఆడే ప్రయత్నం చేశారు. అయితే వీరిద్దరినీ ఔట్ చేసి సిరాజ్ ఆ జట్టును కోలుకోలేని దెబ్బ కొట్టాడు. వికెట్లు పడుతున్న మరో ఎండలో హ్యారీ బ్రూక్ స్వేచ్చగా ఆడాడు. జామీ స్మిత్, ఓవర్టన్, అట్కిన్సన్లు స్వల్పసోర్కుకే వెనుదిరిగారు. ఈ క్రమంలో హ్యారీ బ్రూక్ హాఫ్(54) సెంచరీతో చెలరేగాడు. సిరాజ్, ప్రసిద్ధ కృష్ణ చెరో నాలుగు వికెట్లతో చెలరేగడంతో స్టోక్స్ సేన 51.2 ఓవర్లలో 247 పరుగులకు ఆలౌటైంది.
Also read: 2028 Olympics- దాయాదికి షాక్.. 2028 ఒలింపిక్స్ నుంచి ఔట్..


