అయితే ఇప్పటికే టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ డ్యూక్ బంతుల నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ టెస్టు సిరీస్ కు వాడుతున్న డ్యూక్ బంతి త్వరగా రూపు మారిపోతుందని ఆందోళన చెందాడు. ఇలాంటి బాల్స్ తానెక్కడా చూడలేదని బాహాటంగానే విమర్శించాడు. అయితే ఇటీవలే జరిగిన టెస్టులోనూ భారత ఆటగాళ్లు రెండుసార్లు బంతి మార్పు కోరడం కూడా తీవ్రంగా వివాదాస్పదమైంది. ఈ విషయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా ఇదే విషయాన్ని లేవనెత్తాడు. డ్యూక్స్ కంపెనీ తయారు చేస్తున్న బంతుల్లో ఏదో లోపం ఉందని వ్యాఖ్యానించాడు.
అయితే డ్యూక్స్ బంతుల తయారీదారు దిలీప్ జాజోడియా ఈ మాటలను సీరియస్గా తీసుకున్నారు. 60-65 ఓవర్లకు తర్వాత బంతుల మార్పు చేస్తే బాగుంటుందని అన్నారు. బాల్స్ నాణ్యతపై తాను ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇప్పటికే భారత మార్కెట్లోకి తాము ప్రవేశించేందుకు బెంగళూరు కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.


