Sunday, February 2, 2025
HomeఆటIND vs ENG: చివరి టీ20లో టీమిండియా ఘన విజయం.. రికార్డులు బ్రేక్..!

IND vs ENG: చివరి టీ20లో టీమిండియా ఘన విజయం.. రికార్డులు బ్రేక్..!

ఇంగ్లండ్ తో జరిగిన ఐదో టీ20లో భారత్ జట్టు ఘన విజయం సాధించింది. 150 పరుగుల తేడాతో ఇంగ్లండ్ ను టీమిండియా ఓడించింది. 247 పరుగుల భారీ స్కోర్ తో బరిలోకి దిగిన టీమిండియా.. 10.3 ఓవర్లలో 97 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ లో అద్భుతమైన ప్రదర్శన చేసిన టీమిండియా.. ఇంగ్లండ్ పై ఘన విజయం సాధించింది. దీంతో ఐదు మ్యాచ్ ల టీ20 సిరీస్ లో భారత్ 4-1 తేడాతో దుమ్ము రేపింది.

- Advertisement -

248 పరుగుల కొండంత లక్ష్యం ఉండడంతో ఇంగ్లాండ్ దూకుడుగా ఇన్నింగ్స్ ని ఆరంభించింది. షమీ వేసిన తొలి ఓవర్ లో ఫిలిప్ సాల్ట్ 17 పరుగులు బాది.. మంచి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే ఆ తర్వాతి ఓవర్ లో బెన్ డకెట్ ని గోల్డెన్ డకౌట్ చేశాడు..7 పరుగులు చేసిన జోస్ బట్లర్ ని వరుణ్ చక్రవర్తి అవుట్ చేశాడు. హారీ బ్రూక్ 2 పరుగులు చేసి రవి భిష్ణోయ్ బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 9 పరుగులు చేసిన లియామ్ లివింగ్ స్టోన్ ని వరుణ్ చక్రవర్తి పెవిలియన్ చేర్చాడు.. ఓ వైపు వికెట్లు పడుతూ ఉన్నా మరో ఎండ్ లో కుదురుకుపోయిన ఫిలిప్ సాల్ట్ 21 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు 23 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 55 పరుగులు చేసిన ఫిలిప్ సాల్ట్, శివమ్ దూబే బౌలింగ్ లో అవుట్ అయ్యాడు. 3 పరుగులు చేసిన బేడన్ కర్స్ ని అవుట్ చేసిన అభిషేక్ శర్మ, అదే ఓవర్ లో జమీ ఓవర్టన్ ని పెవిలియన్ చేర్చాడు. జాకబ్ బేథల్ 10 పరుగులు చేసి అవుట్ కాగా 6 పరుగులు చేసిన అదిల్ రషీద్ ని షమీ అవుట్ చేశాడు. ఆ తర్వాతి బంతికి మార్క్ వుడ్ డకౌట్ కావడంతో ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ కి తెర పడింది.

అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ ఇంగ్లీష్ జట్టుకు చుక్కలు చూపించింది. మొదటి బంతి నుండే రెచ్చిపోయిన బ్యాటర్లు.. ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 247 పరుగులు చేసింది. ఏకంగా 20 సిక్సర్లు, 20 ఫోర్లతో బ్యాటర్లు రెచ్చిపోయారు. యువ బ్యాటర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) ఓపెనర్ గా వచ్చి.. తన బ్యాటుతో విజృంభించాడు. కేవలం 54 బంతుల్లో ఏకంగా 13 సిక్సర్లు, 7 ఫోర్లతో 135 పరుగులు చేశాడు, అలాగే తిలక్ వర్మ 24, శివమ్ దుబే 30 పరుగులు చేశారు. ఒకానొక దశలో కేవలం 10 ఓవర్లకు 143 పరుగులు చేసిన భారత్ భారీ స్కోరు దిశగా ముందుకు సాగింది.

కానీ వెంట వెంటనే వికెట్లు పడిపోవడంతో కాస్త స్కోర్ తగ్గింది. సంజు శాంసన్, సూర్యకుమార్ యాదవ్ లు మరోసారి విఫలమయ్యారు. అయినప్పటికీ ఈ మ్యాచులో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. దీంతో టీ20లలో భారత్ తమ నాలుగో అత్యధిక స్కోర్ ఇది. ఇదిలా ఉంటే ఈ మ్యాచులో సెంచరీ చేసిన అభిషేక్ శర్మ భారత జట్టు తరఫున అత్యంత వేగంగా సెంచరీ నమోదు చేసిన ప్లేయర్ల జాబితాలో చోటు దక్కించుకున్నాడు. సెంచరీతో పాటు.. బౌలింగ్ లో రెండు వికెట్లు తీసిన అభిషేక్ శర్మకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది. మరోవైపు ఇంగ్లాండ్ సిరీస్ లో 14 వికెట్లు పడగొట్టిన వరుణ్ చక్రవత్తికి.. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ సొంతం చేసుకున్నాడు. అలాగే తన వ్యక్తిగతంగా టీ20లలో రెండో వేగవంతమైన సెంచరీని నమోదు చేసుకున్నాడు. ఇక ఈ సిరీస్ విజయంతో టీమిండియా జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా 17వ సిరీస్ ను భారత్ సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News