భారత్, ఇంగ్లాండ్(IND vs ENG) జట్ల మధ్య మూడో వన్డే అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ మూడు మార్పులతో బరిలో దిగింది. జడేజా, వరుణ్, షమీ స్థానంలో సుందర్, కుల్‌దీప్, అర్షదీప్ జట్టులోకి వచ్చారు. ఇక మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే టీమిండియా రెండు మ్యాచ్‌లు గెలిచి 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. దీంతో ఇవాళ జరిగే మూడో వన్డే నామమాత్రంగా మారింది. అయితే ఈ మ్యాచ్ కూడా గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని రోహిత్ సేన చూస్తుంటే.. చివరి మ్యాచైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లాండ్ జట్టు పట్టుదలతో ఉంది.
భారత్ జట్టు: రోహిత్ శర్మ(c), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(WK), హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్
ఇంగ్లాండ్ జట్టు: జోస్ బట్లర్(c), ఫిలిప్ సాల్ట్(WK), బెన్ డకెట్, జో రూట్, హ్యారీ బ్రూక్, టామ్ బాంటన్, లియామ్ లివింగ్‌స్టోన్, గుస్ అట్కిన్సన్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్, సాకిబ్ మహమూద్