IND vs ENG Test Series: అండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా భారత్-ఇంగ్లాండ్ జట్ల మధ్య ఐదు టెస్టుల సిరీస్ జరుగుతున్న సంగతి తెలిసిందే. తొలి టెస్టులో ఇంగ్లాండ్ గెలవగా.. రెండో టెస్టులో భారత్ విజయానికి చేరువలో ఉంది. చివరి రోజు ఆటలో మరో ఏడు వికెట్లు తీస్తే విజయం టీమిండియా వశమవుతుంది. అయితే ఈ టెస్టులో టీమిండియా డ్రెస్సింగ్ రూంలో ఓ క్యూట్ లేడీ తరుచూ కనిపించడం చర్చగా మారింది. ఈ మ్యాచ్‌లో స్టార్ బౌలర్ బుమ్రా మ్యాచ్ ఆడటం లేదు. దీంతో డ్రెస్సింగ్ రూంలో కూర్చుని మ్యాచ్‌ను చూస్తూ ఉన్నాడు.
ఈ క్రమంలో ఓ అందమైన అమ్మాయి బుమ్రాను అలాగే క్యూట్‌గా చూస్తూ ఉంది. కెమెరామెన్ ఈ సన్నివేశాన్ని చూపించడంతో సోషల్ మీడియాలో ఫొటో వైరల్ అవుతోంది. దీంతో అభిమానులు ఈమె ఎవరు.. భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ఎందుకు ఉంది..? అని తెగ సెర్చ్ చేస్తున్నారు. ఆమె పేరు యాస్మిన్ బాదియాని. 2010లో లిసెస్టర్ విశ్వవిద్యాలయం నుంచి ఫిజియోథెరఫీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. 2010-2013 మధ్యలో సెస్టర్ సిటీ ఫుట్‌బాల్ క్లబ్ స్పోర్ట్స్ ఫిజియోథెరఫిస్ట్‌గా పనిచేసింది. అనంతరం ఫిజ్ లిమిటెడ్‌లో హెడ్ ఆఫ్ స్పోర్ట్‌గా, క్లినోవాలో ఓఆర్ఎస్ స్పోర్ట్ హెడ్‌గా విధులు నిర్వర్తించింది. ఇక 2022లో ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు(ECB)ఆపరేషన్స్ టీంలో చేరింది.
ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ పర్యటనలో భారత జట్టుకు సహాయం చేయడానికి ఈసీబీ ఆమెను నియమించింది. దీంతో ఆమె భారత జట్టుతో కలిసి ప్రయాణం చేస్తుంది. అందుకే డ్రెస్సింగ్ రూంలో జట్టు సభ్యులతో పాటు టీమిండియా సపోర్ట్ స్టాఫ్‌తో కలిసి కనిపిస్తుంది. సాధారణం ఏదైనా జట్టు తమ దేశానికి క్రికెట్ ఆడటానికి వచ్చినప్పుడు ఆతిథ్య క్రికెట్ బోర్డు తమ బృందంలోని ఓ వ్యక్తిని ఆ జట్టుకు సాయం కోసం నియమిస్తుంది. ఈ క్రమంలోనే యాస్మిన్‌ను భారత జట్టుకు సాయంగా ఇంగ్లాండ్ బోర్డు అపాయింట్ చేసింది. దీంతో తన డ్యూటీలో భాగంగా జట్టు సభ్యులతో క్లోజ్‌గా ఉంటూ వారికి అసవరమైన సహాయాన్ని అందిస్తూ ఉంటుంది.
Also Read: నటుడిగా మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఎంట్రీ
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగుల భారీ స్కోరుకు ఆలౌట్ అయింది. ఇక ఇంగ్లాండ్ 407 పరుగులకు ఆలౌట్ అవ్వడంతో భారత్‌కు 180 పరుగుల ఆధిక్యం లభించింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ గిల్ సేన అదరగొట్టింది. ముఖ్యంగా గిల్ తొలి ఇన్నింగ్స్‌లో 269 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లోనూ 161 పరుగులో దుమ్మురేపాడు. దీంతో టీమిండియా 427/6 పరుగులకు ఇన్నింగ్స్ డిక్లేర్డ్ చేసి ఆతిథ్య జట్టుకు 608 పరుగుల భారీ టార్గెట్ విధించింది. లక్ష్య చేధనలో ఇంగ్లాండ్ జట్టు 77 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. ఇవాళ జరిగే చివరి రోజు ఆటలో ఇంగ్లాండ్ గెలవాలంటే 531 పరుగులు చేయాలి. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాలి. ఈ మ్యాచ్‌లో భారత్ గెలవడం లేదా డ్రా కావడం మాత్రమే జరుగుతుంది. మరోవైపు ఐదో రోజు వరుణుడు ముప్పు కూడా పొంచి ఉంది.