Sunday, February 8, 2026
HomeఆటIND vs NZ 1st T20I: అభిషేక్ అదుర్స్.. రింకూ ఫినిష్.. తొలి టీ20 మనదే!

IND vs NZ 1st T20I: అభిషేక్ అదుర్స్.. రింకూ ఫినిష్.. తొలి టీ20 మనదే!

IND vs NZ 1st T20I Match Highlights: అభిషేక్ శర్మ విధ్వంసకర ఇన్నింగ్స్, బౌలర్ల కట్టుదిట్టమైన ప్రదర్శనతో న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. 239 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్, భారత బౌలింగ్ దాటికి నిర్ణీత ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకోలేక ఓటమిపాలైంది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యచ్ అభిషేక్ శర్మకు దక్కింది.

- Advertisement -

అభిషేక్ అదిరిపోయే ఆరంభం..రింకూ ఫినిషింగ్ టచ్..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 238/7 భారీ స్కోరు సాధించింది. టీమ్ ఇండియా యంగ్ సంచలనం అభిషేక్ శర్మ కేవలం 35 బంతుల్లో 8 సిక్సర్లు, 5 ఫోర్లతో 84 పరుగులతో కివీస్ బౌలర్లను చీల్చి చెండాడాడు. సంజూ, ఇషాన్ స్వల్ప స్కోర్లుకే ఔటైనప్పటికీ.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(32), ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా(25) మెరుపులు మెరిపించడం.. చివర్లో రింకూ సింగ్ (44) అదిరిపోయే ఫినిషింగ్ టచ్ ఇవ్వడంతో భారత స్కోరు 200 పరుగుల మార్క్ దాటింది. రింకూ డారిల్ మిచెల్ వేసిన ఆఖరి ఓవర్‌లో 21 పరుగులు రాబట్టడం విశేషం.

Also Read: ICC RANKINGS: – కోహ్లీ ‘కిరీటం’ కోల్పోయె..

ఫిలిప్స్ మెరిసిన ఫలితం లేదు..
భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. ఆరంభం నుండే భారత పేసర్లు కట్టుదిట్టమైన లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తూ వికెట్లు పడగొట్టారు. కివీస్ బ్యాటర్లలో డారిల్ మిచెల్ మరియు గ్లెన్ ఫిలిప్స్ పోరాడినప్పటికీ, పెరుగుతున్న రన్ రేట్ ఒత్తిడిలో వికెట్లు సమర్పించుకున్నారు. భారత స్పిన్నర్లు మధ్య ఓవర్లలో పరుగులు ఇవ్వకుండా కట్టడి చేయడంతో కివీస్ విజయం కష్టతరమైంది. దీంతో కివీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. గ్లెన్ ఫిలిప్స్(78) పరుగులతో రాణించాడు. ఈ విజయంతో భారత్ పూర్తి ఆత్మవిశ్వాసంతో రెండో టీ20కి సిద్ధమైంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News