Saturday, February 14, 2026
HomeఆటShivam Dube: వైజాగ్ టీ20లో దూబే విధ్వంసం.. హార్దిక్ పాండ్యా రికార్డు బద్దలు!

Shivam Dube: వైజాగ్ టీ20లో దూబే విధ్వంసం.. హార్దిక్ పాండ్యా రికార్డు బద్దలు!

Shivam Dube fastest fifty in Vizag T20I Match: విశాఖపట్నంలోని ACA-VDCA స్టేడియంలో బుధవారం న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో టీ20లో భారత ఆల్‌రౌండర్ శివమ్ దూబే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. టీమిండియా ఓటమి పాలైనప్పటికీ, దూబే తన మెరుపు ఇన్నింగ్స్‌తో రికార్డుల పుస్తకాలను తిరగరాశాడు.

- Advertisement -

హార్దిక్ రికార్డు బ్రేక్
ఛేదనలో టీమిండియా కష్టాల్లో ఉన్న సమయంలో బరిలోకి దిగిన దూబే.. కేవలం 15 బంతుల్లోనే అర్ధసెంచరీ పూర్తి చేశాడు. తద్వారా అంతర్జాతీయ టీ20ల్లో భారత్ తరపున అత్యంత వేగంగా ఫిఫ్టీ సాధించిన మూడో బ్యాటర్‌గా నిలిచాడు. గతేడాది సౌత్ ఆఫ్రికాపై 16 బంతుల్లో ఫిఫ్టీ చేసిన హార్దిక్ పాండ్యా రికార్డును దూబే అధిగమించాడు.

భారత్ తరపున వేగవంతమైన టీ20 ఫిఫ్టీలు:

యువరాజ్ సింగ్: 12 బంతులు (vs ఇంగ్లాండ్, 2007)

అభిషేక్ శర్మ: 14 బంతులు (vs న్యూజిలాండ్, 2026 – గౌహతి)

శివమ్ దూబే: 15 బంతులు (vs న్యూజిలాండ్, 2026 – వైజాగ్)

హార్దిక్ పాండ్యా: 16 బంతులు (vs సౌత్ ఆఫ్రికా, 2025)

Also Read: ICC T20I Rankings -ఐసీసీ ర్యాంకింగ్స్‌లో దూసుకొచ్చిన సూర్య.. టాప్ ప్లేస్‌లో అభిషేక్, వరుణ్!

రోహిత్‌తో సమానంగా!
ఇన్నింగ్స్ మధ్యలో ఇష్ సోధి వేసిన ఒకే ఓవర్‌లో దూబే మూడు భారీ సిక్సర్లు, రెండు ఫోర్లతో ఏకంగా 28 పరుగులు పిండుకున్నాడు. తద్వారా టీ20ల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత బ్యాటర్ల జాబితాలో రోహిత్ శర్మతో కలిసి ఉమ్మడిగా మూడో స్థానంలో నిలిచాడు.

ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు (ఇండియా):

యువరాజ్ సింగ్: 36 పరుగులు (vs బ్రాడ్)

సంజు శాంసన్: 30 పరుగులు (vs రిషాద్ హోస్సేన్)

రోహిత్ శర్మ / శివమ్ దూబే: 28 పరుగులు

దురదృష్టకర రీతిలో రనౌట్
దూబే 23 బంతుల్లో 65 పరుగులు (3 ఫోర్లు, 7 సిక్సర్లు) చేసి అజేయంగా కనిపిస్తున్న వేళ.. విధి వంచించింది. హర్షిత్ రాణా కొట్టిన స్ట్రైట్ డ్రైవ్ బౌలర్ మ్యాట్ హెన్రీ వేళ్లకు తగిలి నాన్-స్ట్రైకర్ ఎండ్‌లో ఉన్న వికెట్లను తాకింది. దురదృష్టవశాత్తు దూబే క్రీజు వెలుపల ఉండటంతో రనౌట్‌గా వెనుదిరగాల్సి వచ్చింది. ఆ రనౌటే మ్యాచ్ మలుపు తిప్పింది.

మ్యాచ్ హైలైట్స్:
న్యూజిలాండ్ స్కోరు: 215/7 (సీఫెర్ట్ 62, డారిల్ మిచెల్ 39*)

భారత్ స్కోరు: 165/10 (దూబే 65, రింకూ సింగ్ 39)

సిరీస్ పరిస్థితి: భారత్ 3-1 ఆధిక్యంలో ఉంది.

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News