IND vs NZ 5th T20 Highlights: భారత టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మరోసారి తన మెరుపు బ్యాటింగ్‌తో చరిత్ర సృష్టించాడు. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో మిస్టర్ 360 ఒక అరుదైన మైలురాయిని చేరుకున్నాడు. టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత తక్కువ బంతుల్లో 3000 పరుగులు పూర్తి చేసిన ఆటగాడిగా సూర్యకుమార్ యాదవ్ ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. స్కై కేవలం 1822 బంతుల్లోనే ఈ ఘనతను అందుకున్నాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వంటి దిగ్గజాలను ఆయన అధిగమించాడు.
టాప్ 7 జాబితా ఇదే..
సూర్యకుమార్ యాదవ్ (భారత్)-1822
ముహమ్మద్ వసీం (UAE)- 1947
జోస్ బట్లర్ (ఇంగ్లాండ్)- 2068
ఆరోన్ ఫించ్ (ఆస్ట్రేలియా)- 2077
డేవిడ్ వార్నర్ (ఆస్ట్రేలియా)- 2113
రోహిత్ శర్మ (భారత్)- 2149
విరాట్ కోహ్లీ (భారత్)- 2169
Also Read: India Vs New Zealand : – న్యూజిలాండ్‌పై భారత్ ఘన విజయం..
మ్యాచ్ హైలైట్స్:
శనివారం తిరువనంతపురం వేదికగా కివీస్ తో జరిగిన చివరి టీ20లో టీమ్ ఇండియా ఘన విజయం సాధించి సిరీస్ ను 4-1తో కైవసం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించింది. అభిషేక్ శర్మ 16 బంతుల్లోనే 30 పరుగులు (4 ఫోర్లు, 2 సిక్సర్లు) చేసి మెరుపు ఆరంభాన్ని ఇచ్చాడు. లోకల్ బాయ్ సంజూ(6) నిరాశపరిచాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్య, కేవలం 30 బంతుల్లో 63 పరుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లు, 6 భారీ సిక్సర్లు ఉన్నాయి. సూర్యకు తోడుగా ఇషాన్ కిషన్ అద్భుతమైన సెంచరీతో మెరవడంతో టీమ్ ఇండియా నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 271 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్ లో కివీస్ తడబడింది. ఓపెనర్ ఫిన్ అలెన్(80) తప్ప మిగతా బ్యాటర్లు పెద్దగా రాణించలేకపోవడంతో ఆ జట్టు 19.4 ఓవర్లలో 225 పరుగులకు ఆలౌటైంది.

