Monday, February 16, 2026
HomeఆటIND vs NZ 5th T20I: వరల్డ్ కప్‌కు ముందు ఆఖరి పరీక్ష.. గెలిచేది ఎవరు?

IND vs NZ 5th T20I: వరల్డ్ కప్‌కు ముందు ఆఖరి పరీక్ష.. గెలిచేది ఎవరు?

IND vs NZ 5th T20I: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ చివరి ఘట్టానికి చేరుకుంది. ఇప్పటికే సిరీస్‌ను కైవసం చేసుకున్న టీమ్ ఇండియా.. చివరి మ్యాచ్‌లోనూ గెలిచి ఘనంగా ముగించాలని చూస్తోంది. మరోవైపు, వరుస ఓటముల తర్వాత గత మ్యాచ్‌లో గెలిచి ఫామ్‌లోకి వచ్చిన కివీస్, అదే జోరును కొనసాగించాలని భావిస్తోంది.

- Advertisement -

ఐదో టీ20 వేదిక మరియు సమయం
వచ్చే నెలలో భారత్ వేదికగా జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు ఇరు జట్లకు ఇది అత్యంత కీలకమైన ప్రాక్టీస్ మ్యాచ్.

తేదీ: జనవరి 31, 2026 (శనివారం).

సమయం: రాత్రి 7:00 గంటలకు (టాస్ 6:30 గంటలకు).

వేదిక: గ్రీన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియం, తిరువనంతపురం.

పిచ్ రిపోర్ట్
తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ స్టేడియం పిచ్ సాధారణంగా బౌలర్లకు అనుకూలిస్తుంది. ఈ మైదానంలో టీమ్ ఇండియాకు మంచి రికార్డు ఉంది. ఇక్కడ ఆడిన నాలుగు మ్యాచ్‌లలో భారత్ మూడింటిలో విజయం సాధించింది. ఇక్కడ పరుగులు చేయడం బ్యాటర్లకు సవాలుతో కూడుకున్న పని. ముఖ్యంగా భారీ లక్ష్యాలను ఛేదించే సమయంలో భారత బ్యాటింగ్ లైనప్‌కు ఇది అసలైన పరీక్ష కానుంది.

Also Read: T20 World Cup 2026 -టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్.. తిలక్ వర్మ రీ-ఎంట్రీ ఫిక్స్! మరో ఇద్దరు కూడా..

ప్రపంచకప్‌కు సన్నాహకం
సిరీస్ ఫలితం తేలిపోయినప్పటికీ, ఈ మ్యాచ్ ప్రపంచకప్ కోసం సరైన ‘ప్లేయింగ్ ఎలెవన్’ను ఎంచుకోవడానికి ఒక గొప్ప అవకాశం. బెంచ్ స్ట్రెంత్‌ను పరీక్షించడానికి, ఆటగాళ్ల రొటేషన్‌కు ఇరు జట్లు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. గత మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్, ప్రపంచకప్‌కు ముందు మళ్లీ విజయాల బాట పట్టాలని పట్టుదలగా ఉంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News