Asia Cup 2025 IND vs OMAN: ఆసియా కప్ చివరి లీగ్ మ్యాచ్‌లో వరుస విజయాలతో దూసుకెళ్తున్న భారత్.. ఈ రోజు నామమాత్రపు పోరులో ఒమన్‌తో తలపడుతోంది. అంతర్జాతీయంగా ఏ ఫార్మాట్‌లోనైనా ఈ జట్టుతో టీమిండియాకు ఇదే తొలిమ్యాచ్. అబుదాబి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్.. టాస్ గెలిచి బ్యాటింగ్‌ను ఎంచుకుంది. క్రీజులోకి అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ వచ్చారు. షకీల్ అహ్మద్ బౌలింగ్‌లో ఆరు పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. శుభ్‌మన్ గిల్ ఔటయ్యాడు.
సూపర్ 4కు చేరినందున రెండు మార్పులతో ఆడుతున్నట్టు టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తెలిపాడు. స్టార్ ప్లేయర్లు బుమ్రా, వరుణ్ చక్రవర్తి బదులు హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి వచ్చినట్లు పేర్కొన్నాడు. మరోవైపు ఒమన్ సైతం రెండు మార్పులతో ఆడుతోంది. ఇంటర్నేషనల్ టీ20ల్లో భారత్‌కు ఇది 250వ మ్యాచ్.
భారత తుది జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సంజూ శాంసన్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, శివం దూబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, హర్షిత్ రానా, అర్ష్‌దీప్ సింగ్, కుల్దీప్ యాదవ్.
ఒమన్ తుది జట్టు: అమిర్ ఖలీం, జతిందర్ సింగ్(కెప్టెన్), హమ్మద్ మిర్జా, వినాయక్ శుక్లా (వికెట్ కీపర్), షా ఫైజల్, జిక్రియా ఇస్లాం, ఆర్యన్ బిష్త్, మొహమ్మద్ నదీం, షకీల్ అహ్మద్, సమయ్ శ్రీవాత్సవ, జితేన్ రమానంది.


