India vs Pakistan live streaming Asia Cup 2025: ఎన్నో రోజులగా ఎదురుచూస్తున్న ఆ క్షణం రానే వచ్చింది. దాయాదుల పోరుకు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం రెడీ అవుతుంది. 2025 ఆసియా కప్‌లో ఆదివారం భారత్, పాకిస్తాన్ జట్లు తలపడబోతున్నాయి. ఈ మెగా టోర్నీలో ఇదే హై వోల్టేజ్ మ్యాచ్ కాబోతుంది. ఈ మ్యాచ్ పై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతుంది. చిరకాల ప్రత్యర్థుల పోరాటం కోసం కొంత మంది వెయిట్ చేస్తుంటే.. మరోవైపు పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పాక్ తో టీమిండియా మ్యాచ్ ఆడవద్దంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఇంకొందరు మ్యాచ్ ను రద్దు చేయాలంటూ పోస్టులు పెడుతున్నారు. ఇంకోవైపు బాయ్ కట్ ట్రెండ్ కూడా నడుస్తోంది. ఈ క్రమంలో అందరి చూపు ఈ మ్యాచ్ పై పడింది.
ఇరు జట్లను పరిశీలిస్తే టీమిండియానే ఫేవరెట్ గా కనిపిస్తోంది. అయితే గ్రూప్-ఏలో ఉన్న రెండు జట్లు చెరో మ్యాచ్ ను నెగ్గి పోటీకి సిద్ధమవుతున్నాయి. గత 16 ఎడిషన్లలో భారత్, పాక్ లు 19 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా అత్యధికంగా 10 మ్యాచుల్లో విజయం సాధించగా.. పాకిస్థాన్ ఆరు మ్యాచ్ ల్లోనే నెగ్గింది. మరో మూడింటిలో ఫలితం రాలేదు. గత చివరి ఐదు టీ20 మ్యాచుల్లో భారత్ మూడు, పాక్ రెండు గెలిచాయి. ఈరోజు జరగబోయే మ్యాచ్ రాత్రి 8 గంటలకు ప్రారంభం అవుతుంది. టాస్ రాత్రి 7:30 గంటలకు వేస్తారు. ఈ మ్యాచ్ ను సోనీ స్పోర్ట్స్ నెట్ వర్క్ ఛానెల్, సోనీలివ్ యాప్ లో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది.
Also Read: Ind vs Pak -పాక్ తో మ్యాచ్.. షాకింగ్ జట్టును ఎంపిక చేసిన చాట్ జీపీటీ..
స్క్వాడ్‌లు:
భారత్: సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభమన్ గిల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్, సంజు శాంసన్, హర్షిత్ రాణా, రింకు సింగ్.
పాకిస్థాన్: సల్మాన్ అఘా (కెప్టెన్), అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్, ఫఖర్ జమాన్, హరీస్ రవూఫ్, హసన్ అలీ, హసన్ నవాజ్, హుస్సేన్ తలాత్, ఖుష్దిల్ షా, మహ్మద్ హారీస్ (వికెట్ కీపర్), మహ్మద్ నవాజ్, సాహిబ్జాదా ఫర్హాన్, సైమ్ అయూబ్, సల్మాన్ అయూబ్, సల్మాన్ అయూబ్, మొఫ్రిక్, సల్మాన్ ఎ మిర్జా, వసీం జూనియర్


