ASIA CUP FINAL 2025 IND vs PAK: దుబాయ్ వేదికగా ఆసియా కప్ 2025లో దాయాదుల పోరుకు సర్వం సన్నద్ధమైంది. ఫైనల్‌లో చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌ను వీక్షించేందుకు యావత్ ప్రపంచం ఎదురుచూస్తోంది. ఈ టోర్నీలో భారత్- పాక్ జట్లు మూడోసారి తలపడుతున్నాయి. టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్‌ను ఎంచుకుంది. పాకిస్థాన్ బ్యాటింగ్ చేయనుంది. కాగా, ఈ మ్యాచ్‌లోనూ టాస్ సందర్భంగా ఇరు జట్ల కెప్టెన్లు కరచాలనం చేసుకోలేదు.
Also Read: https://teluguprabha.net/sports-news/former-delhi-cricketer-mithun-manhas-elected-as-bcci-president/
మరికాసేపట్లో భారత్- పాక్ మధ్య ఆసియా కప్ ఫైనల్ పోరు మొదలు కానుంది. భారత్ గెలవాలని టీమిండియా అభిమానులు హైదరాబాద్‌లో పూజలు చేస్తున్నారు. ఇక దుర్గామాత మండపాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ముచ్చటగా మూడోసారి ఈ మ్యాచ్‌లో గెలిచి పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, సైనికులకు నివాళులర్పించాలని భారత జట్టు ఉవ్విళ్లూరుతోంది. ఈ టోర్నీలో ఒక్క ఓటమిని కూడా చవిచూడని భారత్.. ఫైనల్ మ్యాచ్‌లో కూడా అదే జోరును కొనసాగించాలని నిర్ణయించుకుంది.
భారత్ తుది జట్టు : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, సంజూ శాంసన్(వికెట్ కీపర్), శివం దూబే, రింకూ సింగ్, అక్షర్ పటేల్, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి.
పాక్ తుది జట్టు : సయీం ఆయూబ్, షహిబ్జద ఫర్హాం, ఫఖర్ జమాన్, సల్మాన్ అఘా(కెప్టెన్), హుస్సేన్ తలాట్, మొహమ్మద్ హ్యారిస్ (వికెట్ కీపర్), మొహమ్మద్ నవాజ్, ఫహీం అష్రఫ్, షాహీన్ అఫ్రిది, హ్యారిస్ రవుఫ్, అబ్రార్ అహ్మద్.


