Sunday, January 18, 2026
HomeఆటInd vs SA: మూడో టీ20 మ్యాచ్ నేడే.. వారిద్దరూ ఈసారైనా రాణిస్తారా?

Ind vs SA: మూడో టీ20 మ్యాచ్ నేడే.. వారిద్దరూ ఈసారైనా రాణిస్తారా?

India vs South Africa 3rd T20 Match Live: భారత్, సౌతాఫ్రికా జట్ల మధ్య మూడో టీ20 మ్యాచ్ ఆదివారం ధర్మశాల వేదికగా జరగబోతుంది. గత మ్యాచ్ లో టీమ్ ఇండియాకు షాకిచ్చిన ప్రోటీస్ అదే జోరును ఈ మ్యాచ్ లోనూ కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు సూర్య సేన ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలిచి కిందట మ్యాచ్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తోంది. ఈ కీలక మ్యాచ్ రాత్రి 07 గంటలకు ప్రారంభం కానుంది. దీనిని స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌, జియో హాట్ స్టార్ యాప్ ద్వారా వీక్షించవచ్చు. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్లు 1-1తో సమానంగా ఉన్న సంగతి తెలిసిందే.

- Advertisement -

భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్ శుభ్‌మాన్ గిల్ ఫామ్ ఆందోళన కలిగిస్తోంది. సూర్య భారీ స్కోర్లు సాధించడంలో విఫలమవుతూ వస్తున్నాడు. ఈ సిరీస్ లోనైనా రాణించి వరల్డ్ కప్ కు ముందు గాడిలో పడతాడని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. టీ20ల్లో గిల్ ప్లాఫ్ షో కొనసాగుతోంది. ఇవాళ జరిగే మ్యాచ్ లో రాణించకపోతే అతడిని పక్కన పెట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గత మ్యాచ్ లో ధారాళంగా పరుగులిచ్చిన టీమ్ ఇండియా బౌలర్లు ధర్మశాలలో ఏం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. టీ20ల్లో భారత్, ప్రోటీస్ 33 మ్యాచుల్లో తలపడగా.. 19 మ్యాచుల్లో టీమ్ ఇండియా, 13 గేమ్స్ లో సౌతాఫ్రికా గెలిచాయి.

ఫ్లేయింగ్ XI అంచనా
భారత్ : అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, జితేష్ శర్మ(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, జస్‌ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, అర్ష్‌దీప్ సింగ్.

దక్షిణాఫ్రికా: రీజా హెండ్రిక్స్, క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), డెవాల్డ్ బ్రెవిస్, డేవిడ్ మిల్లర్, డోనోవన్ ఫెర్రీరా, జార్జ్ లిండే, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, లుంగి న్గిడి, ఓట్నీల్ బార్ట్‌మన్.

Also Read: Match Fixing -భారత క్రికెట్‌లో ఫిక్సింగ్ భూతం.. నలుగురు ప్లేయర్స్ సస్పెండ్!

స్క్వాడ్స్
దక్షిణాఫ్రికా జట్టు: క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), ఐడెన్ మార్క్రామ్(కెప్టెన్), టోనీ డి జోర్జి, డెవాల్డ్ బ్రీవిస్, ట్రిస్టన్ స్టబ్స్, డేవిడ్ మిల్లర్, మార్కో జాన్సెన్, కార్బిన్ బాష్, కేశవ్ మహరాజ్, అన్రిచ్ నోర్ట్జే, లుంగి న్గిడి, రీజా హెండ్రిక్స్, ఒట్నీల్ బార్ట్‌మాన్, డోనోవన్ ఫెరీరా, క్వేనా మఫాకా, జార్జ్ లిండే.

భారత జట్టు: అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ(వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చకరవర్తి, కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, సంజూ శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News