Women’s World Cup 2025 Final Viewership: భారత మహిళా క్రికెట్ జట్టు తొలిసారి ప్రపంచకప్ ను ముద్దాడి చరిత్ర సృష్టించింది. ఆసియా టీమ్స్ లో ఏ జట్టు సాధించిన ఘనతను టీమ్ ఇండియా అందుకుంది. అయితే ఈ చారిత్రక ఫైనల్ మ్యాచ్ మైదానంలోనే కాదు, వ్యూయర్‌షిప్ పరంగా కూడా కొత్త రికార్డులను నెలకొల్పింది. వుమెన్ వరల్డ్ కప్ ఫైనల్‌ను చూసిన ఆడియెన్స్ సంఖ్య.. ఏకంగా పురుషుల టీ20 ప్రపంచ కప్ 2024 ఫైనల్‌కు దాదాపు సమానంగా ఉండటం విశేషం.
వ్యూయర్ షిప్ పరంగా ఐసీసీ మహిళల క్రికెట్ ప్రపంచ కప్ 2025 ఫైనల్ మ్యాచ్ సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఈ అద్భుతమైన పోరును జియో హాట్‌స్టార్ ప్లాట్‌ఫామ్ లో 185 మిలియన్ల (18.5 కోట్లు) మంది యూజర్లు వీక్షించారు. ఈ మొత్తం మెగా టోర్నమెంట్‌ను 446 మిలియన్ల (44.6 కోట్లు) మంది వీక్షించినట్లు తెలుస్తోంది. మహిళల క్రికెట్ ప్రజలకు వద్దకు ఎంతలా చేరిందో అనడానికి ఇది నిదర్శనం.
Also Read: IND vs AUS 2025 -నేడే చివరి టీ20.. వన్డే సిరీస్ ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకుంటుందా?
హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలోని టీమ్ ఇండియా కప్ గెలిచిన టైంలో రికార్డు స్థాయిలో 21 మిలియన్ల (2.1 కోట్లు) మంది యూజర్లు ఫైనల్‌ను చూశారు. ఇక టెలివిజన్ ల్లో ఈ హిస్టారికల్ మ్యాచ్ ను చూసిన వీక్షకుల సంఖ్య 9.2 కోట్లు. ఇది కూడా ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ పైనల్, ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 ఫైనల్ మ్యాచ్‌లకు వచ్చిన వీక్షకుల సంఖ్యకు దాదాపు సమానం. మన మహిళల జట్టు సాధించిన విజయాన్ని కోట్లాది మంది ప్రజలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. టీమ్ ఇండియా వుమెన్స్ క్రికెటర్స్ ఎక్కడకు వెళ్లిన బ్రహ్మరథం పడుతున్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని లక్షలాది మంది అమ్మాయిలు స్పోర్ట్స్ లోకి వస్తున్నారు.


