IND vs WI 02nd Test, Day 1 Highlights: ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి పటిష్టమైన స్థితిలో నిలిచింది. టీమ్ ఇండియా తొలి రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 318 పరుగులు చేసింది. ముఖ్యంగా స్టార్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ విండీస్ బౌలర్లను చితక్కొట్టి సెంచరీ సాధించాడు. అంతేకాకుండా అతడు డబుల్ సెంచరీకి కాస్త దూరంలో ఉన్నాడు.
మ్యాచ్ సాగిందిలా..
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ అదిరిపోయే శుభారంభాన్ని ఇచ్చారు. ముఖ్యంగా యశస్వి విండీస్ బౌలర్లను ఆడుకున్నాడు. అహ్మదాబాద్ టెస్టులో సెంచరీ సాధించిన మరో ఓపెనర్ రాహుల్ ఈ మ్యాచ్ లో కేవలం 38 పరుగులే చేసి ఔటయ్యాడు.మరోవైపు జైస్వాల్ సెంచరీ సాధించాడు. తొలి టెస్టులో విఫలమైన సాయి సుదర్శన ఈ మ్యాచ్ లో మంచి ప్రదర్శన చేశాడు. అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని హాఫ్ సెంచరీ కొట్టాడు. వీరిద్దరూ రెండో వికెట్ కు 193 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ క్రమంలో సుదర్శన్ తన టెస్ట్ కెరీర్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు(87) నమోదు చేశాడు. అతడి జస్ట్ లో సెంచరీ మిస్ చేసుకున్నాడు.
జైస్వాల్ బౌండరీల మీద బౌండరీలు కొడుతూ 150 మార్కును దాటాడు. మెుదటి రోజు ఆట ముగిసే సమయానికి జైస్వాల్ 173 పరుగులతోనూ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 20 పరుగులతోనూ ఆడుతున్నారు. వీరిద్దరూ 67 పరుగుల పార్టనర్ షిప్ నెలకొల్పారు. జైస్వాల్ ఇన్నింగ్స్ లో 22 ఫోర్లు ఉన్నాయి. విండీస్ బౌలర్లలో జోమెల్ వారికన్ రెండు వికెట్లు తీశారు. తన టెస్ట్ కెరీర్‌లో యశస్వి జైస్వాల్ 150 పరుగుల మార్కు దాటడం ఇది ఐదోసారి. రెండో రోజు డబుల్ సెంచరీని అందుకుంటే..అతని కెరీర్‌లో మూడోది అవుతుంది. అంతేకాకుండా ఏదైనా ఒక టెస్టు మ్యాచ్ లో తొలి రోజునే 150 పరుగుల మార్కును దాటడం యశస్వికి ఇది రెండోసారి. 2024లో ఇంగ్లాండ్‌పై విశాఖపట్నం వేదిక జరిగిన టెస్టులో మెుదటి రోజు 179 పరుగులను సాధించాడు యశస్వి.
Also Read: Yashasvi Jaiswal- యశస్వి సంచలనం క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డు బ్రేక్ 23 ఏళ్ల వయసులోనే
ఇండియా ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభమన్ గిల్ (కెప్టెన్), ధృవ్ జురెల్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, నితీష్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
వెస్టిండీస్ ప్లేయింగ్ XI: జాన్ కాంప్‌బెల్, టాగెనరైన్ చంద్రపాల్, అలిక్ అథనాజ్, షాయ్ హోప్, రోస్టన్ చేజ్ (కెప్టెన్), టెవిన్ ఇమ్లాచ్ (వికెట్ కీపర్), జస్టిన్ గ్రీవ్స్, జోమెల్ వారికన్, ఖారీ పియరీ, ఆండర్సన్ ఫిలిప్, జేడెన్ సీల్స్


