Saturday, November 15, 2025
HomeఆటIND-W vs BAN-W: వర్షం కారణంగా భారత్-బంగ్లా మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్..

IND-W vs BAN-W: వర్షం కారణంగా భారత్-బంగ్లా మ్యాచ్ రద్దు.. ఇరు జట్లకు చెరో పాయింట్..

ind w vs ban w highlights, Women’s World Cup 2025: ఐసీసీ మహిళల ప్రపంచకప్ 2025లో లీగ్ దశ ముగిసింది. లీగ్ దశలో చివరి మ్యాచ్ అయిన భారత్, బంగ్లాదేశ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయ్యింది. నవీ ముంబైలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ జట్టు 27 ఓవర్లలో 119 పరుగులు చేసింది. అనంతరం టీమ్ ఇండియా విజయం దిశగా సాగిపోతున్న సమయంలో వర్షం పడి భారత్ ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేయాలని నిర్ణయించారు.

- Advertisement -

తొలుత టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది టీమ్ ఇండియా. మెుదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ ప్రారంభం నుంచే వికెట్లు కోల్పోతూ వచ్చింది. 53 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన బంగ్లాను షర్మిన్ అక్తర్ (36 పరుగులు), శోభనా మోస్తరీ (26 పరుగులు) మంచి పార్టనర్ షిప్ నెలకొల్పి జట్టును ఆదుకున్నారు. శోభనా ఔట్ అయిన తర్వాత బంగ్లా వికెట్ల పతనం మెుదలైంది. చివరికి 27 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 119 పరుగులు మాత్రమే చేయగలిగింది. టీమ్ ఇండియా స్పిన్నర్ రాధా యాదవ్ కు మూడు వికెట్లు దక్కాయి.

డక్‌వర్త్-లూయిస్ పద్దతి ప్రకారం, టీమ్ ఇండియా టార్గెట్ ను 126 పరుగులుగా నిర్ణయించారు. ఫీల్డింగ్ సమయంలో మోకాలికి గాయం కావడంతో ఓపెనర్ ప్రతీక రావెల్ బరిలోకి దిగలేదు. దీంతో ఆమె స్థానంలో అమన్‌జోత్ కౌర్ ను ఓపెనర్ గా పంపించింది భారత్ జట్టు. స్మృతి మంధానాతో కలిసి ఓపెనింగ్ చేసిన అమన్‌జోత్ కౌర్ పర్వాలేదనిపించింది. మరోవైపు స్మృతి తనదైన శైలిలో బౌండరీలు విరుచుకుపడింది. 27 బంతుల్లో 6 ఫోర్లుతో 34 పరుగులు చేసింది స్మృతి. భారత్ 8.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 57 పరుగులు చేసిన సమయంలో వర్షం పడింది. వాన ఎంతకు తగ్గకపోవడంతో అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేశారు.

Also Read: Ind vs Aus 2025 – వన్డే క్రికెట్‌లో కింగ్ కోహ్లీ నయా హిస్టరీ.. సచిన్ తర్వాత మనోడే..

మ్యాచ్‌ను రద్దు చేయడం వల్ల బంగ్లాదేశ్ కే లాభం జరిగింది. ఇరుజట్లుకు చెరో పాయింట్ లభించడంతో.. ఎనిమిదో స్థానంలో ఉన్న బంగ్లా జట్టు ఏడో స్థానానికి ఎగబాకింది. ఒక్క మ్యాచ్ కూడా గెలవని పాకిస్థాన్ చివరి స్థానానికి పరిమితమైంది. అయితే దీని ప్రభావం టీమ్ ఇండియాపై పెద్దగా పడలేదు. ఏడు పాయింట్లతో నాలుగో స్థానంలో నిలిచి సెమీఫైనల్ కు అర్హత సాధించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad