Saturday, November 15, 2025
HomeTop StoriesIND-W vs BAN-W: టాస్ గెలిచిన భారత్.. మూడు మార్పులతో బరిలోకి.. బ్యాటింగ్ ఎవరిదంటే?

IND-W vs BAN-W: టాస్ గెలిచిన భారత్.. మూడు మార్పులతో బరిలోకి.. బ్యాటింగ్ ఎవరిదంటే?

IND-W vs BAN-W Live score: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ 2025లో భాగంగా తన చివరి లీగ్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌తో తలపడుతోంది టీమ్ ఇండియా. నవీ ముంబైలోని డీవై పాటిల్ మైదానంలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన భారత మహిళల జట్టు బౌలింగ్ ఎంచుకుంది. ఈసారి హార్మన్ సేన జట్టులో మూడు మార్పులు చేసింది. రిచా ఘోష్, క్రాంతి గౌడ్, స్నేహ్ రాణా స్థానంలో ఉమా చెట్రీ, అమంజోత్ కౌర్, రాధా యాదవ్‌లను ప్లేయింగ్ XIలో చోటు కల్పించింది. అస్సాంకు చెందిన ఉమా చెట్రీకి ఈ మ్యాచ్ ద్వారా ఆరంగ్రేటం చేయబోతుంది. మ్యాచ్ ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉండగా.. వర్షం వల్ల ఆటకు అంతరాయం కలిగింది.

- Advertisement -

హెడ్-టు-హెడ్ రికార్డ్సు
వన్డేల్లో భారత్- బంగ్లా జట్లు ఎనిమిది సార్లు తలపడ్డాయి. ఇందులో టీమ్ ఇండియా ఆరింటిలో గెలవగా..బంగ్లా ఒక్క మ్యాచ్ మాత్రమే నెగ్గింది. ఒక మ్యాచ్ టైగా ముగిసింది. ఈ వరల్డ్ కప్ లో బంగ్లా ఒక్క మ్యాచ్ లో మాత్రమే విజయం సాధించింది. అది కూడా దాయాది జట్టు పాకిస్తాన్ పై. మరోవైపు టీమ్ ఇండియా మూడు మ్యాచుల్లో నెగ్గి.. మూడు మ్యాచుల్లో ఓడి సెమీఫైనల్ కు చేరింది. సెమీస్ కు ముందు ఈ మ్యాచ్ భారత్ సన్నాహాక మ్యాచ్ గా ఉంటుంది.

Also Read: Ind vs Aus 2025 – వన్డే క్రికెట్‌లో కింగ్ కోహ్లీ నయా హిస్టరీ.. సచిన్ తర్వాత మనోడే..

ప్లేయింగ్ XI
టీమ్ ఇండియా: ప్రతీకా రావల్, స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), దీప్తి శర్మ, ఉమా చెత్రీ (వికెట్ కీపర్), అమంజోత్ కౌర్, రాధా యాదవ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్

బంగ్లాదేశ్: సుమైయా అక్టర్, రుబ్యా హైదర్ ఝెలిక్, షర్మిన్ అక్తర్, శోభనా మోస్తరీ, నిగర్ సుల్తానా(కెప్టెన్/వికెట్ కీపర్), షోర్నా అక్టర్, రీతు మోని, రబెయా ఖాన్, నహిదా అక్టర్, నిషితా అక్టర్ నిషి, మరుఫా అక్టర్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad