Saturday, November 15, 2025
HomeTop StoriesIND-W vs BAN-W Live: మరికొన్ని గంటల్లో భారత్-బంగ్లా మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?

IND-W vs BAN-W Live: మరికొన్ని గంటల్లో భారత్-బంగ్లా మ్యాచ్.. ఎక్కడ చూడొచ్చంటే?

- Advertisement -

IND-W vs BAN-W Live score, Women’s World Cup: వుమెన్స్ వరల్డ్ కప్ లో భారత మహిళల జట్టు మరో కీలక పోరుకు రెడీ అయింది. ఇటీవల న్యూజిలాండ్ ను మట్టికరిపించి సెమీఫైనల్ కు చేరుకున్న టీమ్ ఇండియా లీగ్ దశలో తన చివరి మ్యాచ్ ను బంగ్లాదేశ్ తో ఇవాళ ఆడబోతుంది. ఈ రెండు జట్ల మధ్య పోరుకు ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది. సెమీస్ కు ముందు ఇది ప్రాక్టీష్ మ్యాచ్ గా హర్మన్‌ సేనకు ఉపయోగపడనుంది.

హెడ్-టు-హెడ్ రికార్డ్సు

వన్డేల్లో భారత్ బంగ్లా జట్టుతో ఎనిమిది సార్లు తలపడింది. ఇందులో టీమ్ ఇండియా ఆరు విజయాలు సాధించగా.. బంగ్లా ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. ఈ వరల్డ్ కప్ లో తొలి రెండు మ్యాచ్ ను సులభంగా నెగ్గిన భారత్.. ఆ తర్వాత వరుసగా మూడు మ్యాచుల్లో ఓడిపోయింది. గత మ్యాచ్ లో కివీస్ ను ఓడించి సెమీస్ చేరింది. మరోవైపు బంగ్లా జట్టు ఈ ప్రపంచకప్ లో ఒక్క మ్యాచ్ లో మాత్రమే నెగ్గింది, అది కూడా పాకిస్థాన్ పై.

ఎక్కడ చూడాలి?

భారత కాలమానం ప్రకారం, టీమ్ ఇండియా-బంగ్లా మ్యాచ్ మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. టాస్ మధ్యాహ్నం 2:30 గంటలకు వేస్తారు. ఈ మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లో వీక్షించవచ్చు. జియో హాట్ స్టార్ లో కూడా దీనిని చూడొచ్చు.

Also Read: Ind vs Aus 2025 – వన్డే క్రికెట్‌లో కింగ్ కోహ్లీ నయా హిస్టరీ.. సచిన్ తర్వాత మనోడే..

ప్లేయింగ్ XI అంచనా:

టీమ్ ఇండియా: రిచా ఘోష్ (వికెట్ కీపర్), స్మృతి మంధాన, రోడ్రిగ్స్, హార్మన్ ప్రీత్ కౌర్ (కెప్టెన్), డియోల్, ప్రతీకా రావల్, డీబీ శర్మ, స్నేహ రాణా, అమన్ జోత్ కౌర్, రేణుకా సింగ్, శ్రీ చరణి

బంగ్లాదేశ్: ఫర్గానా హోక్, నిగర్ సుల్తానా (కెప్టెన్), షర్మిన్ అక్తర్, శోభనా మోస్తరీ, రుబ్యా హైదర్, షోర్నా అక్టర్, ఫహిమా ఖాతున్, రీతు మోని, నహిదా అక్టర్, మరుఫా అక్టర్, రబేయా ఖాన్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad