Saturday, November 15, 2025
HomeఆటIND W Vs NZ W: భారత్-కివీస్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ నేడే.. ఎక్కడ చూడొచ్చంటే?

IND W Vs NZ W: భారత్-కివీస్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ నేడే.. ఎక్కడ చూడొచ్చంటే?

ICC Women’s World Cup 2025: ఐసీసీ మహిళల ప్రపంచ కప్ కీలక దశకు చేరుకుంది. సెమీస్ రేసులో మెుదటి మూడు స్థానాలు ఖరారు అయిపోయాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికా ఇప్పటికే తమ సెమీస్ బెర్త్ లను కన్పామ్ చేసుకున్నాయి. నాలుగో స్థానం కోసం భారత్, న్యూజిలాండ్ జట్లు పోటీపడుతున్నాయి. ఇరు జట్లు మధ్య పోరుకు నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియం వేదిక కానుంది. ఈ మ్యాచ్ గురువారం మధ్యాహ్నం 3 గంటలకు జరగనుంది. సెమీస్ కు వెళ్లాలంటే టీమ్ ఇండియా ఈ మ్యాచ్ లో తప్పక గెలవాల్సిందే. ఇరు జట్లు ఒకే సంఖ్యలో పాయింట్లను కలిగి ఉన్నాయి. ఈ మెగా టోర్నీలో న్యూజిలాండ్ -0.245తో పోలిస్తే భారత్ +0.526తో మెరుగైన నెట్ రన్ రేట్ ను కలిగి ఉంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే హర్మన్ సేన నేరుగా సెమీస్ కు వెళ్తుంది. ఒక వేళ ఓడితే ఇతర జట్ల ఫలితాలను, నెట్ రన్ రేట్ పై ఆధారపడి ఉంటుంది.

- Advertisement -

మ్యాచ్ ను ఎక్కడ చూడొచ్చంటే?
ఈ వరల్డ్ కప్ రేసును అద్భుతంగా ప్రారంభించిన టీమ్ ఇండియా తర్వాత తన జోరును కొనసాగించ లేకపోయింది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మరియు దక్షిణాఫ్రికాలపై ఓడిపోయి సెమీస్ ఆశలను క్లిష్టతరం చేసుకుంది. కివీస్ తో మ్యాచ్ లో నెగ్గి సెమీస్ చేరాలని చూస్తోంది. మరోవైపు న్యూజిలాండ్ సెమీఫైనల్ ఆశలు సజీవంగా ఉండాలంటే భారత్ తో మ్యాచ్ తప్పక గెలవాలి. అంతేకాకుండా మిగిలిన మ్యాచ్ లను కూడా ఆ జట్టు గెలవాల్సి ఉంటుంది. ఈ రెండు జట్ల మధ్య జరగబోయే మ్యాచ్ ను స్టార్ స్పోర్ట్స్‌తోపాటు జియో హాట్ స్టార్ యాప్ లో వీక్షించవచ్చు.

పిచ్ ఎలా ఉందంటే?
డివై పాటిల్ మైదానం బౌన్స్ మరియు బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. టాస్ గెలిచిన జట్టు ముందుగా బ్యాటింగ్ చేసే అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ లో మంచు కీలకపాత్ర పోషించే సూచనలు కనిపిస్తున్నాయి. స్మృతి మంధాన మరియు ప్రతీక రావల్ మరోసారి మంచి ఆరంభాన్ని ఇవ్వాలని, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మరోసారి కీలక ఇన్నింగ్స్ ఆడాలని జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటోంది. బౌలింగ్ ఆశలన్నీ దీప్తి శర్మ మరియు రేణుకా ఠాకూర్ పై ఉన్నాయి. కివీస్ ఆల్ రౌండర్ సోఫీ డివైన్ ఆ జట్టుకు బలం. ఆ జట్టు పేస్ ద్వయం లియా తహుహు మరియు జెస్ కెర్‌పై ఎక్కువగా ఆధారపడుతుంది.

Also Read: IND vs AUS -రేపు అడిలైడ్‌లో రెండో వన్డే.. ఈ మైదానంలో భయంకరమైన రికార్డు కలిగి ఉన్న రో-కో?

స్క్వాడ్స్
భారత్ జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన (వైస్ కెప్టెన్), ప్రతీకా రావల్, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, ఉమా చెత్రీ, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ రాణా, శ్రీ చరణి, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి.

రిజర్వ్‌ ఫ్లేయర్స్: తేజల్ హసబ్నిస్, ప్రేమ రావత్, ప్రియా మిశ్రా, మిన్ను మణి, సయాలీ సత్‌ఘరే

న్యూజిలాండ్ జట్టు: సోఫీ డివైన్ (కెప్టెన్), సుజీ బేట్స్, ఈడెన్ కార్సన్, హన్నా రోవ్, ఇజ్జీ గేజ్, మ్యాడీ గ్రీన్, బ్రూక్ హాలిడే, బ్రీ ఇల్లింగ్, పాలీ ఇంగ్లిస్, బెల్లా జేమ్స్, మెలీ కెర్, జెస్ కెర్, రోజ్మేరీ మెయిర్, జార్జియా ప్లిమ్మర్, లీ టహుహు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad