IND-W vs SA-W Final, Women’s World Cup 2025: కొత్త ఛాంపియన్‌గా అవతరించేందుకు భారత్, దక్షిణాఫ్రికా జట్లు ఒక్క అడుగు దూరంలో ఉన్నాయి. తొలి సారి ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో ఇవాళ నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగే తుది పోరులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. ఈ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం, మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ చారిత్రాత్మక ఫైనల్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌తోపాటు జియోహాట్‌స్టార్ యాప్ మరియు వెబ్‌సైట్‌లో వీక్షించవచ్చు. ఈ మ్యాచ్ కు వరుణుడు అడ్డంకి కలిగించే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది.
హెడ్-టు-హెడ్ రికార్డ్సు
భారత్, దక్షిణాఫ్రికా జట్లు వన్డేల్లో 34 సార్లు తలపడ్డాయి. ఇందులో టీమ్ ఇండియా 20 మ్యాచుల్లో గెలవగా..సౌతాఫ్రికా 13 మ్యాచుల్లో నెగ్గింది. ఒక మ్యాచులో ఫలితం తేలలేదు. ఈ వరల్డ్ కప్ లో ఇరు జట్లు అక్టోబర్ 9న లీగ్ దశలో తలపడ్డాయి. ఈ పోరులో దక్షిణాఫ్రికా మూడు వికెట్లు తేడాతో గెలిచింది. ఆ మ్యాచ్‌లో నాడిన్ డి క్లెర్క్ అజేయంగా 84 పరుగులు చేయడంతోపాటు బౌలింగ్ లో రెండు వికెట్లు కూడా తీసింది. అయితే హెడ్-టు-హెడ్ రికార్డులో టీమిండియా ఆధిక్యాన్ని కనబరిచింది. సెమీఫైనల్లో ఆస్ట్రేలియాపై రికార్డు స్థాయిలో 339 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన హార్మన్ సేన.. ఫైనల్లో ఎలా ఆడుతుందోనని అందరిలోనూ అంచనాలు నెలకొన్నాయి.
ఫ్లేయింగ్ XI అంచనా:
భారత్: స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, జెమిమా రోడ్రిగ్స్, హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), దీప్తి శర్మ, రిచా ఘోష్ (వికెట్ కీపర్), అమన్ జోత్ కౌర్, రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా ఠాకూర్
దక్షిణాఫ్రికా: లారా వోల్వార్డ్(కెప్టెన్), టాజ్మిన్ బ్రిట్స్, సునే లూస్, అన్నేరీ డెర్క్సెన్, అన్నేకే బాష్, మారిజాన్ కాప్, సినాలో జాఫ్తా(కెప్టెన్), క్లోయ్ ట్రియోన్, నదిన్ డి క్లెర్క్, అయబొంగా ఖాకా, నాన్‌కులులేకో మ్లాబా
Also Read: Jemimah Rodrigues- ”ఆ జీసెస్ నాతో ఉండటం వల్లే ఇదంతా చేయగలిగాను”..
జట్లు
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, హర్లీన్ డియోల్, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, రేణుకా సింగ్ ఠాకూర్, దీప్తి శర్మ, స్నేహ్ రాణా, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రాధా యాదవ్, అమంజోత్ కౌర్, అరుంధతి రెడ్డి, ఉమా చెట్రీ, షఫాలి వర్మ.
దక్షిణాఫ్రికా జట్టు: లారా వోల్వార్డ్ట్ (కెప్టెన్), అయాబొంగా ఖాకా, క్లో ట్రయాన్, నాడిన్ డి క్లెర్క్, మారిజాన్ కాప్, తజ్మిన్ బ్రిట్స్, సినాలో జఫ్తా, నాన్‌కులులెకో మ్లాబా, అన్నరీ డెర్క్‌సెన్, అన్నేకే బోష్, మసాబాటా క్లాస్, తుకాన్ సే లూస్, కమీ నో లూస్, కమీ లూస్, షాంగసే


