Sunday, December 22, 2024
HomeఆటAsia Cup: అండర్ -19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్‌

Asia Cup: అండర్ -19 మహిళల ఆసియా కప్ ఛాంపియన్‌గా భారత్‌

ఉమెన్స్ అండర్-19 ఆసియా కప్‌లో(U19 womens Asia Cup) టీమిండియా(Team India) సంచలనం సృష్టించింది. కౌలాలంపూర్‌ వేదికగా బంగ్లాదేశ్‌(Bangladesh) జట్టుతో జరిగిన ఫైనల్ మ్యాచులో భారత మహిళల జట్టు అద్భుతం సృష్టించింది. ఈ మ్యాచులో తొలుత టాస్ గెలిచిన బంగ్లా జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన భారత అమ్మాయిలు నిర్ణీత 20 ఓవర్లలో 117/7 పరుగులు చేశారు.

- Advertisement -

అనంతరం 118 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలో దిగిన బంగ్గాదేశ్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో భారత్ 41 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి కప్పు ఎగరేసుకుపోయింది. భారత బౌలర్లలో ఆయుషి శుక్లా 3, సోనమ్ యాదవ్ , పరుణిక సోసోడియా చెరో 2 వికెట్లు, జోషిత ఇక వికెట్ పడగొట్టి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. కాగా ఉమెన్స్ విభాగంలో ఆసియా కప్ అండర్ 19 టోర్నీలో కప్ గెలిచిన తొలి జట్టుగా టీమిండియా రికార్డు నెలకొల్పింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News