Saturday, November 15, 2025
HomeఆటIndia vs Bangladesh: ఇండియా–బంగ్లాదేశ్ రెండో వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

India vs Bangladesh: ఇండియా–బంగ్లాదేశ్ రెండో వన్డే.. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్

India vs Bangladesh: ఇండియా–బంగ్లాదేశ్ జట్ల మధ్య రెండో వన్డే ప్రారంభమైంది. ఢాకాలోని షెరె బంగ్లా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ రెండో ఓవర్లోనే 11 పరుగులు వద్ద తొలి వికెట్ కోల్పోయింది.

- Advertisement -

మహ్మద్ సిరాజ్ బౌలింగ్‌లో ఓపెనర్ అనాముల్ హకి ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. ప్రస్తుతం క్రీజులో నజ్ముల్ హొసైన్ షాంటో, లిట్మన్ దాస్ ఉన్నారు. భారత జట్టుకు సంబంధించి రెండు మార్పులు జరిగాయి. షాబాద్ అహ్మద్ స్థానంలో అక్షర్ పటేల్‌ను తీసుకున్నారు. గత మ్యాచ్ ద్వారా వన్డేల్లో అరంగేట్రం చేసిన కుల్‌దీప్ సేన్ వెన్ను నొప్పితో బాధపడుతున్నాడు.

దీంతో అతడికి విశ్రాంతినిచ్చిన జట్టు అతడి స్థానంలో ఉమ్రాన్ మాలిక్‌కు చోటు కల్పించారు. మొదటి వన్డేలో బంగ్లాదేశ్ చేతిలో ఇండియా ఓడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ మ్యాచ్‌లో గెలవడం ఇండియాకు తప్పనిసరి. ఈ మ్యాచ్‌లో ఓడితే టీమిండియా సిరీస్ కోల్పోతుంది. దీంతో ఈసారి ఎలాగైనా గెలవాలని ఇండియా పట్టుదలతో ఉంది.
భారత తుది జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్, మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad