Thursday, April 3, 2025
HomeఆటRohit Sharma: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ శర్మ

Rohit Sharma: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన రోహిత్ శర్మ

Rohit Sharma| టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(Rohit Sharma) మరోసారి తండ్రి అయ్యారు. శుక్రవారం రాత్రి ముంబైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన భార్య రితిక(Rithika) పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కాగా రోహిత్-రితిక దంపతులకు ఇప్పటికే సమైరా అనే కుమార్తె ఉన్న సంగతి తెలిసిందే. 2015లో రోహిత్-రితిక పెళ్లి అయింది.

- Advertisement -

నవంబర్ 22న ఆస్ట్రేలియాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ(Border-Gavaskar Trophy) జరగనుంది. ఇప్పటికే ఈ సిరీస్ కోసం భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లింది. రోహిత్ మాత్రం భార్య డెలివరీ ఉండంటతో ఇండియాలోనే ఉండిపోయాడు. అయితే మ్యాచ్ ప్రారంభానికి ఇంకా వారం రోజులు మాత్రమే సమయం ఉండటంతో రోహిత్ అందుబాటులో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అందుబాటులో లేకపోతే వైస్ కెప్టెన్ జస్‌ప్రీత్ బుమ్రా సారథిగా వ్యవహరించనున్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News