IND vs BAN : బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి టెస్టులో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 513 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లా 324 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్ 188 పరుగులతో తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఫలితంగా రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
ఓవర్‌నైట్ స్కోర్ 272/6 తో ఆఖరి రోజైన ఆదివారం రెండో ఇన్నింగ్స్‌ను కొనసాగించిన బంగ్లాదేశ్ మరో 52 పరుగులు జోడించి మిగిలిన నాలుగు వికెట్లు కోల్పోయింది. అక్షర్ పటేల్ నాలుగు, కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టగా ఉమేశ్ యాదవ్, సిరాజ్, అశ్విన్ తలా ఓ వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పుజారా 90, శ్రేయస్ అయ్యర్ 86 పరుగులతో రాణించడంతో 404 పరుగులకు ఆలౌటైంది. అనంతరం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన బంగ్లా 150 పరుగులకే కుప్పకూలింది. దీంతో భారత్‌కు 254 పరుగుల ఆధిక్యం లభించింది. బంగ్లాను ఫాలో ఆన్ ఆడించే అవకాశం ఉన్నప్పటికీ కూడా కెప్టెన్ రాహుల్ మరోసారి బ్యాటింగ్ చేసేందుకే మొగ్గు చూపాడు.
శుభ్‌మన్(110), పుజారా(102 నాటౌట్) శతకాలు బాదారు. దీంతో భారత్ తన రెండో ఇన్నింగ్స్ ను 258/2 స్కోర్ వద్ద డిక్లేర్ చేసి బంగ్లాదేశ్ ముందు 513 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. అయితే బంగ్లా 324 పరుగులకే కుప్పకూలింది. కుల్దీప్ యాదవ్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇక ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ ఈ నెల 22 నుంచి ఆరంభం కానుంది. ఈ మ్యాచ్‌కు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ అందుబాటులోకి రానున్నాడు.