Axar Patel: పాకిస్థాన్ తో మ్యాచ్ కు ముందు భారత్ కు షాక్ తగిలింది. భారత స్టార్ ప్లేయర్ తలకు గాయమైంది. ఆసియా కప్‌లో ఒమన్‌తో జరిగిన మ్యాచ్ లో భారత స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు గాయమైంది. శుక్రవారం రాత్రి ఈ మ్యాచ్ జరగగా.. ఫీల్డింగ్ చేస్తుండగా తల నేలకు తాకడంతో ఇబ్బందిపడ్డాడు. దీంతో మైదానం వీడాడు. ఆ తర్వాత సబ్‌స్టిట్యూట్‌గా రింకు సింగ్ వచ్చాడు. దీంతో అక్షర్ పరిస్థితిపై సందేహం నెలకొంది. అతడి తలకు జరిగిన గాయం గురించి అభిమానుల్లో ఆందోళన నెలకొంది. సూపర్ -4 ముంగిట స్పిన్ ఆల్‌రౌండర్‌కు ఇలా జరిగితే నష్టమే అవుతుందని క్రికెట్ విశ్లేషకుల అంచనా. అయితే, అక్షర్‌కు ఏం కాలేదని ఫీల్డింగ్ కోచ్ దిలీప్ వెల్లడించాడు. ప్రస్తుతం బాగానే ఉన్నాడంటూ తెలిపాడు. కానీ, అక్షర్ కు స్కానింగ్ చేసే అవకాశం ఉందని బీసీసీఐ వర్గాలు పేర్కొన్నాయి. అందులో ఏ సమస్య లేకపోతే అక్షర్ ఆడొచ్చు. లేకపోతే మరొకరిని తీసుకోవాల్సిందే.
Read Also: Black Eyed Peas: పిడికెడు గింజలు తింటే చాలు.. పుష్కలమైన లాభాలు..!
ఒకవేళ అక్షర్ అడే పరిస్థితి లేకపోతే..?
ఇకపోతే, ఆసియా కప్ లో భారత్ సూపర్ -4లోకి దూసుకెళ్లింది. అందులో భాగంగానే ఆదివారం పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. దీంతో అక్షర్ తుది జట్టులో లేకపోతే.. టీమిండియా ఇద్దరు స్పెషలిస్ట్ స్పిన్నర్లతోనే బరిలోకి దిగాల్సి ఉంటుంది. కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి ఇప్పటికే మంచి ఫామ్ లో ఉన్నారు. అభిషేక్ శర్మ కూడా స్పిన్ వేయగల వ్యక్తే. అవసరమైతే అక్షర్ స్థానాన్ని భర్తీ చేయగలడు. అక్షర్ పటేల్ ఉండటం వల్ల ఇటు బ్యాటర్‌గానూ, బౌలర్‌గానూ రాణిస్తాడు. ఆల్‌రౌండర్ కోటాను భర్తీ చేయడం అంత సులువేం కాదు. మిగతా మ్యాచులకూ దూరమైతే అప్పుడు వాషింగ్టన్ సుందర్ రూపంలో స్టాండ్ బై ఆటగాడు రెడీగా ఉన్నాడు.
Read Also: Surya Grahan: చంద్రవంకగా ఆదిత్యుడి దర్శనం.. ఈసారి ఏర్పడే సూర్యగ్రహణం స్పెషల్..
ఒమన్ తో మ్యాచ్ లో మార్పులు..
ఒమన్‌తో జరిగిన మ్యాచ్ లో ప్రధాన బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, వరుణ్ చక్రవర్తి ఆడలోదు. వారిద్దరికి విశ్రాంతి దొరికింది. ఆ స్థానాల్లో హర్షిత్ రాణా, అర్ష్‌దీప్‌సింగ్‌లు ఆడారు. అయితే, ఒమన్‌ను తక్కువ స్కోరుకు కట్టడి చేయడంలో భార బౌలర్లు విఫలమయ్యారు. దీంతో సూపర్-4 మ్యాచులకు మళ్లీ పాత టీమ్‌నే బరిలోకి దింపే అవకాశం లేకపోలేదు. అప్పుడు అక్షర్ లేకపోతే అదనంగా బ్యాటర్‌ను తీసుకొనే ఛాన్స్ ఉంది. రింకు సింగ్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ మ్యాచ్ లో స్ట్రాంగ్ బ్యాటింగ్ ఆర్డర్ ఉండటం అత్యంత కీలకం. ఇక, ఆసియా కప్ టీ20 టోర్నీలో నామమాత్రమైన చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయింది. చిన్న జట్టయిన ఒమన్‌పై 21 పరుగుల తేడాతో చెమటోడ్చి నెగ్గింది. బుమ్రా, వరుణ్ లేని భారత బౌలింగ్ నిరాశపరచడంతో 189 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడానికి భారత్ కష్టపడాల్సి వచ్చింది.


