Saturday, November 15, 2025
HomeTop StoriesAsiaCup: పాక్‌పై భారత్ మరో ఘన విజయం.. చెలరేగిన అభిషేక్!

AsiaCup: పాక్‌పై భారత్ మరో ఘన విజయం.. చెలరేగిన అభిషేక్!

India defeats Pakistan in Asia cup: సూపర్‌ 4లో భారత జట్టు శుభారంభం చేసింది. చిరకాల ప్రత్యర్థి అయిన పాక్‌పై మళ్లీ టీమ్‌ఇండియాదే పైచేయి సాధించింది. ఈ విజయంతో ఆసియా కప్‌లో పాకిస్థాన్‌పై భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసుకుంది. భారత ఓపెనర్ అభిషేక్‌ శర్మకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. భారత్‌ తన తర్వాతి మ్యాచ్‌లో బుధవారం బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.

- Advertisement -

భారత్ బ్యాటింగ్: 172 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత ఓపెనర్లు శుభ్‌మన్ గిల్ (47), అభిషేక్ శర్మ (74) విధ్వంసం సృష్టించారు. కేవలం 9.5 ఓవర్లలోనే 105 పరుగులు జోడించి గెలుపుకు బలమైన పునాది వేశారు. అయితే.. వెంటవెంటనే గిల్, సూర్యకుమార్ యాదవ్ (0), అభిషేక్ శర్మ అవుట్ కావడంతో స్కోరు నెమ్మదించింది. అయినప్పటికీ తిలక్ వర్మ (30 నాటౌట్), సంజూ శాంసన్ (13) ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. చివర్లో హార్దిక్ పాండ్యా (7 నాటౌట్) తో కలిసి తిలక్ వర్మ జట్టును విజయతీరాలకు చేర్చాడు. భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. పాకిస్థాన్ బౌలర్లలో హరీస్ రౌఫ్ రెండు వికెట్లు తీయగా, అబ్రార్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ తీసుకున్నారు.

Also Read:https://teluguprabha.net/sports-news/sourav-ganguly-set-for-dramatic-return-to-indian-cricket-as-cab-president/

పాకిస్థాన్ బ్యాటింగ్: టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. ఓపెనర్ సాహిబ్జాదా ఫర్హాన్ 58 పరుగులతో అర్ధ సెంచరీ సాధించగా.. చివర్లో ఫహీమ్ అష్రఫ్ 20 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. భారత ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం పాక్‌కు కలిసొచ్చింది. భారత బౌలర్లు ధారాళంగా పరుగులు ఇవ్వడంతో పాకిస్థాన్ భారీ స్కోర్ల చేసింది. భారత బౌలర్లలో శివమ్ దూబే రెండు వికెట్లు తీయగా, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా ఒక్కో వికెట్ పడగొట్టారు. జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్లలో 45 పరుగులు ఇచ్చి వికెట్లేమీ తీయలేకపోయాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad