Saturday, November 15, 2025
HomeఆటAsia Cup T20: పాక్‌పై భారత్‌ ఘన విజయం.. సూపర్‌-4లోకి అడుగు!

Asia Cup T20: పాక్‌పై భారత్‌ ఘన విజయం.. సూపర్‌-4లోకి అడుగు!

India vs Pakistan: ఆసియా కప్ టీ20 టోర్నీలో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుతూ.. పాకిస్థాన్‌పై ఘన విజయం సాధించింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్‌లో టీమ్‌ఇండియా 7 వికెట్ల తేడాతో పాక్‌ను ఓడించి సూపర్‌-4లో తన స్థానాన్ని ఖాయం చేసుకుంది.

- Advertisement -

బౌలర్ల దెబ్బకు పాకిస్థాన్ విలవిల: మొదట బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ భారత బౌలర్ల సమష్టి దాటికి 9 వికెట్ల నష్టానికి 127 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత్ తరపున కుల్దీప్ యాదవ్ (3/18) మరోసారి అద్భుత ప్రదర్శనతో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’గా నిలిచాడు. అతనికి తోడుగా అక్షర్ పటేల్ (2/18), బుమ్రా (2/28), మరియు వరుణ్ చక్రవర్తి (1/24) పాక్ బ్యాటింగ్ లైనప్‌ను దెబ్బతీశారు. పాకిస్థాన్ ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ (40) మరియు టెయిలెండర్ షహీన్ షా అఫ్రిది (33 నాటౌట్) పోరాడకుంటే పాక్ స్కోరు ఇంకా తక్కువగా ఉండేది.

భారత బ్యాట్స్‌మెన్ల మెరుపులు: 128 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాట్స్‌మెన్‌లు దూకుడుగా ఆడారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (47 నాటౌట్) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఓపెనర్లు అభిషేక్ శర్మ (31) మరియు శుభ్‌మన్ గిల్ (10) కూడా ధాటిగా ఆరంభించారు. తిలక్ వర్మ (31)తో కలిసి సూర్యకుమార్ జట్టును విజయానికి దగ్గరగా తీసుకొచ్చాడు. చివరికి 15.5 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి భారత్ లక్ష్యాన్ని సులభంగా ఛేదించింది. పాక్ బౌలర్లలో సయిమ్ అయూబ్ (3/35) మూడు వికెట్లు తీశాడు.

Also Read:https://teluguprabha.net/sports-news/pakisthan-won-the-toss-and-chose-batting-india-bowling-asia-cup-2025/

వికటించిన పాకిస్థాన్ టాస్ నిర్ణయం: టాస్ గెలిచి పాకిస్థాన్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. మ్యాచ్ ఆరంభంలోనే హార్దిక్ బౌలింగ్‌లో సయిమ్ అయూబ్ ఔట్ కాగా.. ఆ తర్వాత బుమ్రా బౌలింగ్‌లో హారిస్ (3), ఫఖర్ జమాన్ వరుసగా పెవిలియన్ చేరారు. స్పిన్నర్లు అక్షర్, కుల్దీప్ మాయాజాలానికి పాకిస్థాన్ 65 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది.

పహల్గాం ఉగ్రదాడి బాధితులకు అంకితం: విజయం అనంతరం భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, ఈ విజయాన్ని పహల్గాం ఉగ్రదాడి బాధితులకు, సాయుధ దళాలకు అంకితం చేస్తున్నట్లు సూర్యకుమార్‌ తెలిపారు. భారత్ తన తదుపరి మరియు చివరి లీగ్ మ్యాచ్‌లో శుక్రవారం ఒమన్‌తో తలపడనుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad