అండర్-19 మహిళల టీ20 వరల్డ్ కప్‌లో (ICC Women’s U19 T20 World Cup) టీమిండియా జైత్ర యాత్రను కొనసాగిస్తోంది. ఇప్పటికే గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో గెలిచిన భారత్.. తాజాగా సూపర్ సిక్స్ గ్రూప్-1లో సత్తా చాటింది. బంగ్లాదేశ్ టీమ్‌ను చిత్తుగా ఓడించి, సెమీ ఫైనల్ బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది. బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో భారత్ విజయం సాధించింది.
మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్.. భారత బౌలర్ల దెబ్బకు 20 ఓవర్లలో 64/8కే కుప్పకూలింది. బంగ్లా జట్టులో సుమైయా అక్తేర్ (21) టాప్ స్కోరర్ గా నిలిచింది. భారత బౌలర్లలో వైష్ణవి శర్మ (Vaishnavi Sharma) 3 వికెట్లు పడగొట్టింది. జోషిత, షబ్నామ్, త్రిష చెరో వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్.. స్వల్ప లక్ష్యాన్ని 7.1 ఓవర్లలోనే ఛేదించారు. తెలుగమ్మాయి గొంగడి త్రిష 31 బంతుల్లో 40 పరుగులు (8 ఫోర్లు) చేసి ఔట్ అయింది. అనంతరం సానికా చాల్కే (11), నిక్కీ ప్రసాద్ (5) మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అండర్ 19 టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వరుస విజయాలు నమోదు చేస్తుంది. గ్రూప్ దశలో వెస్టిండీస్, మలేషియా, శ్రీలంక జట్లను మట్టికరిపించిన టీమిండియా. సూపర్ సిక్స్ లో బంగ్లాదేశ్ ను ఓడిచింది. ఈ సూపర్ సిక్స్ లో భారత జట్టు తన నెక్స్ట్ మ్యాచ్‌ను జనవరి 28న స్కాట్లాండ్‌తో పోటీ పడనుంది.