Friday, November 22, 2024
HomeఆటInd vs NZ 1st ODI : ఓట‌ముల్లో టీమ్ఇండియా చెత్త రికార్డు

Ind vs NZ 1st ODI : ఓట‌ముల్లో టీమ్ఇండియా చెత్త రికార్డు

Ind vs NZ 1st ODI : ఆక్లాండ్ వేదిక‌గా న్యూజిలాండ్‌తో జ‌రిగిన తొలి వ‌న్డేలో భార‌త జ‌ట్టు 7 వికెట్ల తేడాతో ఘోర ఓట‌మిని చ‌విచూసింది. ఈ నేప‌థ్యంలోనే టీమ్ఇండియా ఓ చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకుంది. వ‌న్డేల్లో న్యూజిలాండ్ పై వ‌రుస‌గా ఐదు మ్యాచుల్లో ఓడి అభాసుపాలైంది. 2019 ప్ర‌పంచ‌క‌ప్ సెమీఫైన‌ల్‌లో మొద‌లైన ఓట‌ముల ప‌రంప‌ర నేటి మ్యాచ్‌లోనూ కొన‌సాగించింది.

- Advertisement -

2019 వన్డే ప్రపంచకప్‌లో ఇరు జట్లు తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో భారత్ 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ త‌రువాత 2020లో విరాట్ కోహ్లీ నేతృత్వంలో భారత్ మరోసారి న్యూజిలాండ్‌లో పర్యటించింది. ఆ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ టీమ్ఇండియా ఓడిపోయింది. ఇప్పుడు శిఖర్ ధావన్ నాయకత్వంలోని భారత్ ఓడిపోయిన మ్యాచ్.. వన్డేల్లో న్యూజిలాండ్‌పై భారత్‌కు వరుసగా ఐదో ఓటమిగా మారింది. చ‌రిత్ర‌లో ఇలా వ‌రుస‌గా కివీస్ పై వ‌న్డేల్లో భార‌త్ ఐదు మ్యాచుల్లో ఎన్న‌డూ ఓడిపోలేదు.

చివ‌రి సారిగా ఫిబ్రవరి 2019లో కివీస్ పై భార‌త్ విజ‌యం సాధించింది. ఆ మ్యాచ్‌లో అంబటి రాయుడు 90 పరుగులు చేయ‌డంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ 35 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక నేటి మ్యాచ్ విషయానికి వ‌స్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(50; 65 బంతుల్లో 1ఫోర్‌, 3 సిక్స్‌లు), శిఖ‌ర్ ధావ‌న్‌(72; 77 బంతుల్లో 13 ఫోర్లు) ల‌తో పాటు శ్రేయ‌స్ అయ్య‌ర్‌(80; 76 బంతుల్లో4ఫోర్లు, 4 సిక్స్‌లు) రాణించ‌డంతో నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 7 వికెట్ల న‌ష్టానికి 306 ప‌రుగులు చేసింది. అనంత‌రం 307 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని కివీస్ మ‌రో 17 మిగిలి ఉండ‌గానే చేధించింది. టామ్ లాథ‌మ్‌(145 నాటౌట్; 104 బంతుల్లో 19 ఫోర్లు, 5 సిక్స్‌లు) కెప్టెన్ కేన్ విలియ‌మ్స‌న్ (94 నాటౌట్; 98 బంతుల్లో 7 పోర్లు, ఒక సిక్స్‌) జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News