ఇంగ్లాండ్-భారత్(IND vs ENG) జట్ల మధ్య జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా(Ravindra Jadeja) ఓ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఈ మ్యాచ్‌లో 9 ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 26 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 600 వికెట్లు తీసిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు. అంతేకాకుండా 6000 పరుగులు, 600 వికెట్లు తీసిన ఏకైక భారత స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు.
మరోవైపు భారత్- ఇంగ్లాండ్ మధ్య జరిగిన వన్డేల్లోనూ అత్యధిక వికెట్లు(42) తీసిన బౌలర్‌గా రికార్డ్ నెలకొల్పాడు. అంతకుముందు ఈ రికార్డ్ ఇంగ్లాండ్ దిగ్గజ బౌలర్ 40 వికెట్లతో జేమ్స్ అండర్సన్ పేరు మీద ఉంది. ఇక ఇరు జట్ల మధ్య జరిగిన ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్లలో ఆండ్రూ ఫ్లింటాఫ్ (37), హర్భజన్ సింగ్ (36), జవగల్ శ్రీనాథ్ (35) టాప్ 5లో ఉన్నారు.