Gill may skip Duleep Trophy: భారత టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆగస్టు 28 నుంచి జరగబోయే దులీప్ ట్రోఫీకి గిల్ దూరమయ్యే అవకాశం ఉంది. అయితే అతడు ఆసియాకప్ కు మాత్రం అందుబాటులో ఉంటాడనేది సమాచారం. గిల్ దులీప్ ట్రోఫీలో నార్త్ జోన్ కెప్టెన్ గా వ్యవహారిస్తున్న సంగతి తెలిసిందే. అయితే అతడు ఆడతాడా లేదా అనేది నార్త్ జోన్ అసోసియేషన్ నుంచి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. రీసెంట్ గా గిల్ ను పరీక్షించిన ఫిజియోలు అతడు హెల్త్ రిపోర్టును బీసీసీఐకు సమర్పించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం గిల్ చండీగఢ్ లో ఉన్న తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నాడు.
యూఏఈ వేదికగా సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ మెుదలుకానుంది. ఈ మెగా టోర్నీలో టీమిండియాకు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్ గా, గిల్ వైస్ కెప్టెన్ గా వ్యవహారించనున్నారు. గిల్ కారణంగానే శ్రేయస్ అయ్యర్, కుల్దీప్ యాదవ్ కు చోటు దక్కలేదని సెలక్టర్లుపై విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.
Also Read: India Cricket Team -బీసీసీఐ కీలక నిర్ణయం.. రాబోయే వరల్డ్ కప్ కోసం కొత్త సెలక్టర్లు ఎంపిక..
రీసెంట్ గా జరిగిన ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో గిల్ కెప్టెన్ గా, బ్యాటర్ గా తన సత్తాను చాటాడు. అతడు ఐదు టెస్టుల్లో 754 పరుగులు చేశాడు. దీంతో టీమిండియా సెలెక్టర్లు ఇతడిని ఆసియాకప్ టీ20 జట్టుకు ఎంపిక చేశారు. అనారోగ్యం కారణంగా గిల్ దులీప్ ట్రోఫీకి దూరమైతే అతడి స్థానంలో శుభం రోహిల్లాను తీసుకునే యోచనలో నార్త్ జోన్ సెలెక్టర్లు ఉన్నట్లు తెలుస్తోంది. నార్త్ జోన్ జట్టుకు వైస్ కెప్టెన్ గా వ్యవహారిస్తున్న అంకిత్ కుమార్ ఇప్పుడు సారథిగా చేయనున్నాడు. ఆసియా కప్ కోసం అర్ష్‌దీప్ సింగ్ మరియు హర్షిత్ రాణాలు కూడా తమ జోనల్ జట్లను వీడే అవకాశం ఉంది. వీరి స్థానంలో గుర్నూర్ బ్రార్, అనుజ్ థక్రాల్‌లను ఎంపిక చేశారు.
Also Read: Asia Cup – ఇండియా వర్సెస్ పాకిస్థాన్.. ఎవరిది పై చేయంటే?
నార్త్ జోన్ సెలక్షన్ కమిటీలో చేతన్ శర్మ (హర్యానా), నిఖిల్ చోప్రా (ఢిల్లీ), అమిత్ ఉనియల్ (చండీగఢ్), మిథున్ మిన్హాస్ (జమ్మూ & కె మరియు కన్వీనర్), రాజ్ కుమార్ (సర్వీసెస్) మరియు ముఖేష్ కుమార్ (హిమాచల్ ప్రదేశ్) ఉన్నారు.


