India Tour of Bangladesh : టీ20 ప్రపంచకప్ తరువాత భారత జట్టు వరుస విదేశీ పర్యటనలతో బిజీగా ఉంది. కివీస్ పర్యటన ముగియడంతో ఇప్పుడు బంగ్లాదేశ్ కు వెళ్లనుంది. బంగ్లా పర్యటనలో భారత జట్టు మూడు వన్డేలు, రెండు టెస్టులు ఆడనుంది. డిసెంబర్ 4 నుంచి వన్డే సిరీస్, డిసెంబర్ 14 నుంచి టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. రోహిత్ నాయకత్వంలో పాల్గొనే టెస్టు, వన్డే జట్టును సెలక్టర్లు ఎంపిక చేశారు. కివీస్ పర్యటనకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్‌లు తిరిగి జట్టులో చేరనున్నారు.
వన్డే సిరీస్ షెడ్యూల్ ఇదే..
భారత్, బంగ్లాదేశ్‌ల మధ్య డిసెంబర్ 4న తొలి వన్డే, డిసెంబర్ 7న రెండో వన్డే, ఆఖరి వన్డే డిసెంబర్ 10న జరగనుంది. ఈ మూడు మ్యాచ్‌లకు ఢాకాలోని షేర్ ఏ బంగ్లా నేషనల్ స్టేడియం వేదిక కానుంది. భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌లు మధ్యాహ్నాం 12 గంటల 30 నిమిషాలకు ఆరంభం అవుతాయి.
రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి టెస్టు మ్యాచ్ డిసెంబర్ 14 నుంచి 18 వరకు చిట్టగాంగ్లోని జహుర్ అహ్మద్ చౌదరి స్టేడియంలో జరగనుంది. రెండో టెస్ట్ డిసెంబర్ 22 నుంచి 26 వరకు ఢాకాలో జరగనుంది
వన్డే జట్టు : రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, శ్రేయాస్ అయ్యర్, రాహుల్ త్రిపాఠి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, ఎమ్.డి. సిరాజ్, దీపక్ చాహర్, యశ్ దయాళ్.
టెస్టు జట్టు:
రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్మన్ గిల్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్. షమీ, ఎమ్.డి. సిరాజ్, ఉమేశ్ యాదవ్.