జూన్ నెలలో భారత U19 జట్టు(U19 Team) ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఈ పర్యటన కోసం సెలెక్టర్లు జట్టును ప్రకటించారు. ఈ జట్టులో ఐపీఎల్ 2025 లో సంచలనంగా మారిన యువ ఆటగాళ్లకు అవకాశం దక్కింది. రాజస్థాన్ రాయల్స్ యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi), చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ ఆయుష్ మ్హత్రే (Ayush Mhatre)లకు స్థానం కల్పించారు. జూన్ 24 నుంచి జూలై 23 వరకు ఈ పర్యటన జరగనుంది. ఇందులో 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్‌తో పాటు ఐదు మ్యాచ్‌ల యూత్ వన్డే సిరీస్, ఇంగ్లాండ్ U19 జట్టుతో రెండు మల్టీ-డే మ్యాచ్‌లు జరగనున్నాయి.
భారత U19 జట్టు: ఆయుష్ మాత్రే (కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, విహాన్ మల్హోత్రా, మౌల్యరాజ్‌సిన్హ్ చావ్డా, రాహుల్ కుమార్, అభిజ్ఞాన్ కుందు (WK), హర్వాన్ష్ సింగ్ (WK), RS అంబరీష్, కనిష్క్ చౌహాన్, ఖిలాన్ రావ్ పటేల్, హెన్త్ మహమ్మద్ ఈనాన్, ఆదిత్య రాణా, అన్మోల్జీత్ సింగ్.. స్టాండ్‌బై ప్లేయర్స్: నమన్ పుష్పక్, డి దీపేష్, వేదాంత్ త్రివేది, వికల్ప్ తివారీ, అలంకృత్ రాపోల్ (WK)