Saturday, November 15, 2025
HomeఆటInd vs Aus 2025: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోకో రీఎంట్రీ వాయిదా?

Ind vs Aus 2025: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. రోకో రీఎంట్రీ వాయిదా?

- Advertisement -

India vs Australia 1st ODI: క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్, ఆస్ట్రేలియా హై వోల్టేజ్ పోరు రేపు మెుదలుకానుంది. ఈ కీలక పోరు కోసం పెర్త్‌లోని ఆప్టస్ స్టేడియం వేదిక కానుంది. ఈ మూడు మ్యాచుల వన్డే సిరీస్ కు తొలిసారి శుభ్‌మాన్ గిల్ భారత్ జట్టుకు నాయకత్వం వహించనున్నాడు. దాదాపు ఏడు నెలల తర్వాత రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రీఎంట్రీ ఇవ్వనున్నారు. వీరిద్దరి చివరిసారిగా దుబాయ్ లో జరిగిన ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడారు.

హెడ్-టు-హెడ్ రికార్డ్స్

పెర్త్ మైదానంలో ఇప్పటి వరకు మూడు మ్యాచులు ఆడిన ఆస్ట్రేలియా అన్నింటిలోనూ ఓడిపోయింది. ఇది టీమ్ ఇండియాకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఆసీస్ పై భారత్ రికార్డు చాలా దారుణంగా ఉంది. ఈ రెండు జట్లు 158 వన్డే మ్యాచుల్లో తలపడగా.. ఆస్ట్రేలియా 84, భారత్ 58 గెలిచాయి. పది మ్యాచుల్లో ఫలితం రాలేదు.

టెన్షన్ పెంచేస్తున్న వెదర్

భారత్ ఆస్ట్రేలియా పోరులో వాతావరణం కీలకపాత్ర పోషించనుంది. ఆదివారం పెర్త్‌లో వర్షం పడే అవకాశం 63 శాతం ఉందని అక్కడి వాతావరణ శాఖ పేర్కొంది. అయితే అదేగానీ జరిగి మ్యాచ్ రద్దు అయితే, రోకో ఎంట్రీ మరింత కాలం వేచిచూడాల్సి రావచ్చు. భారత కాలమానం ప్రకారం, ఈ మ్యాచ్ ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది. గిల్ కెప్టెన్సీలో వెస్టిండీస్ పై టెస్టు సిరీస్ విజయం తర్వాత సిరీస్ కావడంతో దీనిపై భారీగానే అంచనాలు ఉన్నాయి.

ఇండియా ప్లేయింగ్ 11: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీష్ కుమార్ రెడ్డి, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్.

ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11: మిచెల్ మార్ష్ (కెప్టన్), ట్రావిస్ హెడ్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, మాథ్యూ షార్ట్, మార్నస్ లాబుస్చాగ్నే, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, జేవియర్ బార్ట్‌లెట్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్

Also Read: Indian Cricket Team -ఆస్ట్రేలియా పర్యటనకు బయలుదేరిన టీమ్ ఇండియా.. సెంట్రాఫ్ ఎట్రాక్షన్ గా రోకో..

జట్లు:

భారత జట్టు: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, యశస్వి జైస్వాల్, కెఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, ధ్రువ్ జురెల్, ప్రసిద్ధ్ కృష్ణ

ఆస్ట్రేలియా జట్టు: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్(కెప్టెన్), మార్నస్ లాబుస్చాగ్నే, మాథ్యూ షార్ట్, మాట్ రెన్షా, మిచెల్ ఓవెన్, జోష్ ఫిలిప్(వికెట్ కీపర్), కూపర్ కొన్నోలీ, మిచెల్ స్టార్క్, జేవియర్ బార్ట్‌లెట్, జోష్ హాజిల్‌వుడ్, బెన్ డ్వార్షుయిస్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్

 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad