Saturday, November 15, 2025
HomeఆటIND vs AUS: బౌలర్లకు పిచ్ అనుకూలం.. గెలిచేదెవరో?

IND vs AUS: బౌలర్లకు పిచ్ అనుకూలం.. గెలిచేదెవరో?

IND vs AUS: వన్డే ఓటమి తర్వాత ఆస్ట్రేలియాతో పొట్టి క్రికెట్ సిరీస్ కు భారత్ సిద్ధమైంది. కాన్ బెర్రా వేదికగా ఇవాళ మధ్యాహ్నం 1.45 నుంచి మ్యాచ్ జరగనుంది. అయితే, వన్డేలతో పోలిస్తే టీ20ల్లో ఆస్ట్రేలియా బలంగా కనిపిస్తోంది. టిమ్‌ డేవిడ్, స్టాయినిస్, జోష్‌ ఇంగ్లిస్‌ లాంటి ప్లేయర్లు జట్టుకు బలంగా మారారు. సూపర్‌ ఫామ్‌లో ఉన్న కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌పై భారీ అంచనాలున్నాయి. వన్డేల్లో రాణించలేకపోయిన ట్రావిస్‌ హెడ్‌.. టీ20ల్లో చెలరేగుతాడని జట్టు భావిస్తోంది. వీరికి తోడు మాథ్యూ షార్ట్, మిచెల్‌ ఒవెన్‌లతో ఆసీస్‌ బ్యాటింగ్‌ విభాగం ఎంతో మెరుగ్గా కనిపిస్తోంది. వన్డేల్లో విజృంభించిన హేజిల్‌వుడ్‌కు తోడు బార్ట్‌లెట్, డ్వార్షుయిస్, ఎలిస్‌లతో పేస్‌ పటిష్టంగా ఉంది. స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా లేకపోవడం ఆసీస్ కు నష్టమే, భారత్‌కు ఊరటే. కానీ కునెమన్‌ కూడా బ్రిలియంట్ స్పిన్నరే.

- Advertisement -

Read Also: IND vs AUS: ఇటు అభిషేక్‌.. అటు బుమ్రా.. ఆస్ట్రేలియాతో భారత్ టీ20 సిరీస్

పిచ్ బౌలర్లకు అనుకూలం

ఇకపోతే, తొలి టీ20కి వేదికైన కాన్‌బెర్రాలో పిచ్‌ బౌలర్లకు అనుకూలం. పేసర్లను ఎదుర్కోవడం కష్టమే. బౌండరీలు కూడా పెద్దవి. కాబట్టి ఇక్కడ భారీ స్కోర్లు నమోదు కావు. 160 స్కోరు చేస్తే కాపాడుకోవచ్చు. బుధవారం వర్షం పడే సూచనలున్నా.. మ్యాచ్‌ సమయానికి ఇబ్బంది లేకపోవచ్చని తెలుస్తోంది. గణాంకాల ప్రకారం, చివరి 10 టీ20ల్లో భారత్‌ ఒక్క మ్యాచే ఓడింది. 8 టీ20ల్లో నెగ్గగా.. ఒక మ్యాచ్‌ టై అయింది. ఆస్ట్రేలియా కూడా చివరి 10 టీ20ల్లో ఒక్క మ్యాచే ఓడింది. ఆ జట్టు 8 విజయాలు సాధించగా.. ఒక మ్యాచ్‌ వర్షం వల్ల రద్దయింది.

Read Also: Women’s World Cup: ప్రపంచ కప్ లో కీలక పోరు.. ఇంగ్లాండ్- సౌతాఫ్రికా మధ్య తొలి సెమీఫైనల్

తుది జట్లివే..

భారత్ తుది జట్టు అంచనా: అభిషేక్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్, సూర్యకుమార్‌ (కెప్టెన్‌), సంజు శాంసన్, తిలక్‌ వర్మ, శివమ్‌ దూబె, అక్షర్‌ పటేల్, బుమ్రా, హర్షిత్‌ రాణా, అర్ష్‌దీప్, వరుణ్‌ చక్రవర్తి/కుల్‌దీప్‌;

ఆస్ట్రేలియా తుది జట్టు అంచనా: మిచెల్‌ మార్ష్‌ (కెప్టెన్‌), ట్రావిస్‌ హెడ్, జోష్‌ ఇంగ్లిస్, మాథ్యూ షార్ట్, మిచెల్‌ ఒవెన్, స్టాయినిస్, టిమ్‌ డేవిడ్, డ్వార్షుయిస్‌/ఎలిస్, బార్ట్‌లెట్, హేజిల్‌వుడ్, కునెమన్‌.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad